తెలంగాణ

విలువలతోనే గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మార్చి 27: నైతిక విలువలు పతనమవుతున్న నేపథ్యంలో పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించి ప్రజల్లో విశ్వాసం చురగొనాలని మహారాష్ట్ర అదనపు డిజిపి, సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్ మెడికల్ కళాశాల (రిమ్స్)లో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మినారాయణ కీలకోపన్యాసం చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్య వృత్తిని పూర్తిచేసుకున్న వంద మంది వైద్యవిద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డిజిపి లక్ష్మినారాయణ మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం స్నాతకోత్సవానికి రిమ్స్ డైరెక్టర్ తనను రావాలని కోరడం జరిగిందన్నారు. దేశానికి ఉపయోగపడే యువత ఎక్కడ ఉంటే అక్కడకు తాను వెళ్తానని అన్నారు. రోగులు ఎంతో నమ్మకంతో వైద్యుల వద్దకు వస్తారని, వారితో మంచిగ మాట్లాడితే మాత్రలకంటే మాటతోనే సగం రోగం నయమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎ.అశోక్, డాక్టర్ వినయ్‌కుమార్, డాక్టర్ తిప్పాస్వామి, వైద్య విద్యార్థులు, వైద్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
చిత్రం వైద్య విద్యార్థులకు పట్టాలు అందజేస్తున్న డిజిపి