తెలంగాణ

గోలివాడ భూసేకరణపై స్టేకు నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన సుందిళ్ల బ్యారేజీ దిగువన గోలివాడ గ్రామంలో భూసేకరణకు లైన్ క్లియర్ చేస్తూ సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు వెకేషన్ కోర్టు నిరాకరించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ ఎన్ బాలయోగితో కూడిన ధర్మాసనం రైతులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించింది. సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం నిమిత్తం రైతుల భూములను సేకరించేందుకు జిల్లా కలెక్టర్‌కు అధికారాలు ఇస్తూ సిసిఎల్‌ఏ ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ సింగిల్ జడ్జి కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రైతులు వెకేషన్ కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా సింగిల్ జడ్జి కోర్టు తీర్పు ఇచ్చిందంటూ పిటిషనర్ల తరఫున న్యాయవాది బి రచనారెడ్డి వాదనలు వినిపించారు. అదనపు అడ్వకేట్ జనరల్ జె రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు వాస్తవాలను కోర్టుకు తెలియచేయడం లేదన్నారు. 119 మంది రైతుల్లో 84 మంది రైతులకు నష్టపరిహారం అందిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక లక్ష కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం చేపట్టిందన్నారు. సుందిళ్ల బ్యారేజీ నిర్మాణానికి భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం ఇంతవరకు 150 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిందన్నారు.