తెలంగాణ

150 వంతెనలకు చెక్‌డ్యామ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: వంతెనలకు చెక్ డ్యామ్‌లు నిర్మించాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నం విజయవంతం అవుతోంది. కర్నాటకలో తొలుత దీన్ని అమలు చేశారు. వంతెనను చెక్ డ్యామ్‌గా ఉపయోగపడేట్టు నిర్మించడం వల్ల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం లభిస్తుంది. రాష్ట్రంలో 150 వంతెనలకు చెక్ డ్యామ్‌లను ఏర్పాటు చేయనున్నారు. సాంకేతికంగా అవకాశం ఉన్న అన్ని వంతెనలకు చెక్ డ్యామ్‌లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో 2495.50 కోట్ల రూపాయలతో 511 వంతెనల నిర్మాణం చేపట్టినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు 139 వంతెనల నిర్మాణం పూర్తి చేసినట్టు, మరో 290 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. గోదావరి నదిపై ఏడు వంతెనలు నిర్మిస్తున్నారు. భద్రాచలం(98కోట్లు), కాళేశ్వరం(150 కోట్లతో), తుపాకుల గూడెం (వంద కోట్లతో)వద్ద జాతీయ రహదారులపై వంతెనలు నిర్మిస్తారు. బాసర వద్ద వంద కోట్లతో రెండవ వంతెన 108 కోట్లతో పంచగుడి వద్ద, 60కోట్లతో బోర్నపల్లి వద్ద, పర్ణశాల వద్ద 180 కోట్లతో సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మిస్తారు. నల్లగొండ జిల్లా మట్టంపల్లి వద్ద, నాగర్ కర్నూలు జిల్లా సోమశిల వద్ద వంతెన నిర్మిస్తారు. మంజీరానదిపై ఎల్లారెడ్డి/ మెదక్‌ల మధ్య 40కోట్లతో వంతెన, నిజాంసాగర్ వద్ద 30 కోట్లతో వంతెన నిర్మిస్తారు. సమీకృత జిల్లా కార్యాలయ భవనాలను ఏడాదిలో పూర్తి చేయనున్నట్టు చెప్పారు. భవనాల సముదాయాల ఆకృతుల రూపకల్పనల బాధ్యతలు ఉషారెడ్డి ఆర్కిటెక్ట్ సంస్థకు అప్పగించినట్టు తెలిపారు. భవనాల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించినట్టు చెప్పారు. 1032 కోట్ల రూపాయల వ్యయంతో సమీకృత జిల్లా కార్యాలయ భవనాల సముదాయాలు, కలెక్టర్లకు, అధికారులకు నివాస గృహాలు నిర్మించనున్నట్టు చెప్పారు.