తెలంగాణ

లైవ్‌లో కాళేశ్వరం పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: రాజధానికి 260 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఎలా సాగుతున్నాయో ముఖ్యమంత్రి కెసిఆర్ తన చాంబర్ నుంచే పరిశీలిస్తారు. నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తన చాంబర్ నుంచే ప్రాజెక్టు పనులు చూస్తూ సూచనలు చేస్తారు. ఇదే సమయంలో ప్రాజెక్టు పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ మెగా కన్‌స్ట్రక్షన్ తన కార్యాలయం నుంచే పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు సూచనలు అమలు చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఉపయోగించుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల నిర్మాణం సాగుతున్న తీరును హైదరాబాద్ నుంచే ప్రత్యక్ష ప్రసారం (లైవ్) ద్వారా పర్యవేక్షిస్తున్నారు. హరీశ్‌రావు తన చాంబర్‌లో ఇటీవల భారీ టివి తెర ఏర్పాటు చేశారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులను లైవ్‌గా వీక్షించడం కోసం హెచ్‌డి టివి ఏర్పాటు చేశారు. దాదాపుగా సినిమా హాలులో కనిపించేంత పెద్దగా ఈ తెర ఉంటుంది. మూడు బ్యారేజీల పనులను మంత్రి తన చాంబర్ నుంచే ఎప్పటికప్పుడు లైవ్‌గా చూసే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి చాంబర్‌లో ఇంతకు ముందు నుంచే ఇలాంటి హెచ్‌డి టివి ఉంది. అప్పుడప్పుడు ముఖ్యమంత్రి సైతం తన చాంబర్ నుంచి ఈ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు. మెగా కన్‌స్ట్రక్షన్ చాంబర్‌లోనూ ఇలాంటి టివి ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుల వద్ద సిసి టివిలు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడి పనుల పురోగతిని హైదరాబాద్ నుంచే లైవ్‌లో పర్యవేక్షించడానికి వీలు కలుగుతోంది.
2018 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయాలని తొలుత ప్రభుత్వం నిర్ణయించింది. భూ సేకరణకు చట్టపరంగా తలెత్తిన సమస్యల వల్ల పనుల్లో ఆలస్యం జరిగింది. అయితే పనుల్లో మరింత వేగం పెంచడం ద్వారా ముందుగా నిర్ణయించుకున్న దాని ప్రకారం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో కూర్చొని పనులు వేగంగా జరుగుతున్నాయా? అని సమీక్షిండం కన్నా ప్రాజెక్టులో పనులను 24 గంటల పాటు హైదరాబాద్ నుంచే చూడడం వల్ల ఆ ప్రభావం తప్పకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తొలుత ఎస్‌ఆర్‌ఎస్‌పి1, 2 ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డిసెంబర్ నాటికి మల్లన్న సాగర్ వరకు పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఖరీఫ్ నాటికి పది టిఎంసిల నీటిని నిల్వ చేసుకునే స్థాయిలో పనులు పూర్తవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. త్వరలోనే 6,7,8 ప్యాకేజీ పనులు పూర్తి అవుతాయని, దీంతో జూలై నాటికి ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరులో నీటిని నింపుకునే అవకాశం ఉంటుందని అన్నారు. దాదాపు 110 కిలో మీటర్ల వరకు కాలువల్లో 105 టిఎంసిల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది. 50 నుంచి 60 టిఎంసిల నీటిని లిఫ్ట్ చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.