తెలంగాణ

నేడు ‘విదేశీ సంపర్క్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: విదేశాంగ శాఖ కార్యకలాపాలు, వివిధ పథకాలు, పాస్‌పోర్టు, వీసా అంశాలతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో రాష్ట్రాలకు ఉండే అనుబంధం, పరిధి, పరిమితులు తదితర అంశాలపై ‘విదేశీ సంపర్క్’ పేరిట విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సు ద్వారా అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఎన్‌జిఓలకు, వ్యక్తులకు అవగాహన కల్పించనున్నామని రీజనల్ పాస్‌పోర్టు అధికారి డాక్టర్ ఇ విష్ణువర్ధనరెడ్డి చెప్పారు. ఇదే సందర్భంగా భారత ప్రభుత్వం పాస్‌పోర్టుల జారీలో తీసుకువచ్చిన సంస్కరణలను, ఆధునిక పద్ధతులను కూడా వివరిస్తామని అన్నారు. పాస్‌పోర్టుల జారీలో ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న తీరుతెన్నులపై కూడా సుదీర్ఘ చర్చ జరుగుతుందని అన్నారు. గత నెల 8వ తేదీన ఢిల్లీలో జరిగిన సదస్సులో వివిధ రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలకు సమాధానంగా ఈ సదస్సు జరుగుతోందని చెప్పారు. దేశంలో ఈ తరహా సదస్సు నిర్వహించడం ఇదే ప్రథమమని అన్నారు. ఈ సదస్సులో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ వికె సింగ్, సీనియర్ అధికారులు పాల్గొంటారని చెప్పారు. మంత్రి తారకరామారావు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొంటారని అన్నారు. విదేశాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సహకారం, సమన్వయం, విదేశీ వలస చట్టాలు, సురక్షితంగా విదేశీయానం, ఇంటి వద్దకే పాస్‌పోర్టు సేవలు వంటి అంశాలపై కూడా చర్చించడం జరుగుతుందని చెప్పారు. ఈ సదస్సు అనంతరం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసుకునే వీలుందని తెలిసింది.