తెలంగాణ

వర్షాకాలం జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: రానున్న వర్షాకాలంలో హైదరాబాద్ నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. శనివారం జిహెచ్‌ఎంసి, జలమండలి, జాతీయ రహదారులు, పోలీసు అధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్షించారు. వర్షాకాలం పూర్తయ్యే వరకు జలమండలి, జిహెచ్‌ఎంసి అధికారులకు సెలవులు రద్దు చేయాలని ఆయా శాఖాధిపతులను ఆదేశించారు. నగరంలోని రోడ్లకు అవసరమైన మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు మూడు వారాల్లోగా రోడ్ల మరమ్మతులు పూర్తి చేసి, గుంతలన్నీ పూడ్చి వేయాలని స్పష్టం చేశారు.
సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. నిరుటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది నాలుగు నెలల ముందు నుంచే ఉమ్మడి సమన్వయ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. నగరంలో నీరు నిలిచే 220 ప్రాంతాలను గుర్తించామని, వీటిలో చాలా వరకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు మంత్రికి తెలిపారు.
మ్యాన్‌హోల్‌లో పడిన కొన్ని దురదృష్ట సంఘటనలు గతంలో జరిగాయని, ఈ ఏడాది అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఆ బాధ్యత సంబంధిత అధికారులదేనని మంత్రి హెచ్చరించారు. ఈ సమీక్షలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్ రెడ్డి, జలమండలి ఎండి దానకిషోర్ తదితరులు పాల్గొన్నారు.