తెలంగాణ

సంక్షోభ పరిష్కారానికి ప్రకృతి సేద్యమే మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: దేశం సంక్షోభం నుండి బయటపడాలంటే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయమే పరిష్కారమని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వం రూ. 50 వేల కోట్లతో ప్రధాన మంత్రి కృషి సించాయి యోజనను ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ప్రతి వ్యవసాయ క్షేత్రానికి నీరు, ప్రతి నీటి బిందువుకూ అధిక పంట ఈ పథకం ఇచ్చే ఫలం అని అన్నారు. డబ్ల్యుటిఓలో తమ ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరి తీసుకుందని, ఎంఎస్‌పి కార్యకలాపాలను కొనసాగించనుందని అన్నారు. నీలి విప్లవానికి ఉత్తేజాన్ని అందిస్తూనే రెండో దశ హరిత, శే్వత విప్లవాలపై శ్రద్ధ తీసుకుంటోందని చెప్పారు.
శీతల గిడ్డంగులను మరింతగా విస్తరించడం, సాగునీరు, వౌలిక సదుపాయాలు, వడ్డీరేట్లు, బీమా అనే నాలుగు అంశాలపై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అన్నారు. రైతులకు రుణ సౌకర్యాన్ని 10 లక్షలకు పెంచడం జరిగిందని చెప్పారు. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ సమీపంలో గల ముచ్చింతల్‌లో చిన జీయర్ స్వామి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ శిబిరంలో ఆయన మాట్లాడారు.
రసాయన అవశేషాలు లేని సురక్షిత ఆహారం ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రైతులు ప్రకృతి సేద్యం పద్ధతుల్లో పంటలు పండించాలని సూచించారు. వ్యవసాయ రంగానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రైతుల సంక్షేమం కోసం భూ స్వస్థత కార్డు పథకం, వేప పూత పూసిన యూరియా సరఫరా, కొత్త కిసాన్ చానల్ వంటి మరికొన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ నెల 21 వరకూ ఈ శిబిరంలో 2వేల మంది ప్రకృతి వ్యవసాయ శిక్షకులకు సుభాశ్ పాలేకర్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో చిన జీయర్ స్వామి, సుభాశ్ పాలేకర్, సీనియర్ ఐఎఎస్ అధికారి విజయకుమార్, జె రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.