తెలంగాణ

ఏడాదిలోగా ఇళ్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబల్ బెడ్‌రూంల ఇళ్ల నిర్మాణం ఏడాదిలోగా పూర్తి చేయాలని భావిస్తున్నట్టు రాష్ట్ర గృహనిర్మాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలందరికీ శనివారం ఆయన లేఖలు రాస్తూ, డబల్ బెడ్‌రూంల నిర్మాణం పారదర్శకంగా ఉండాలని, అర్హతగలవారికే ఇవి చేరాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు భావిస్తున్నారన్నారు. లబ్ధిదారుడిపై ఒక్కపైస భారం లేకుండా విశాలమైన ఇంటిని నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ ప్రణాళిక అన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 1400 ఇళ్లను మంజూరు చేశామని గుర్తు చేశారు. 2.60 లక్షల ఇళ్లను ముఖ్యమంత్రి మంజూరు చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలంతా జిల్లా కలెక్టర్లతో కలిసి, సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఇళ్లస్థలాల ఎంపిక వెంటనే పూర్తిచేసి, లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి, ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టాలని ఆదేశించారు. అక్రమాలకు, అవకతవకలకు ఆస్కారం లేకుండా గృహనిర్మాణ పథకాన్ని పూర్తి చేస్తే, ప్రభుత్వానికి, ప్రజలకు మంచిదన్నారు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఇళ్లనిర్మాణం పూర్తయితే, దేశంలోనే తెలంగాణ ఆదర్శరాష్ట్రంగా నిలుస్తుందని వివరించారు.