తెలంగాణ

వడ్డీ వ్యాపారులదే హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: రాష్ట్రంలో ప్రైవేటు వడ్డీ వ్యాపారులదే ‘హవా’ నడుస్తున్నది. ప్రజలు తమ ఆర్థికపరమైన కష్టాల నుంచి గట్టెక్కేందుకు బ్యాంకులపై ఆధారపడకుండా, ప్రైవేటు వడ్డీ వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. అందుకు కారణం తెలంగాణలో బ్యాంకుల వంటి వ్యవస్థాగతమైన సంస్థల ద్వారా రుణ సౌకర్యం తక్కువగా ఉండడమేనని తెలంగాణ సామాజిక అభివృద్ధి నివేదికలో వెల్లడైన వాస్తవం. తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికా విభాగం కోసం తెలంగాణ సామాజిక అభివృద్ధి మండలి తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. నగరాల్లో, గ్రామాల్లో ఎస్‌సి, ఎస్‌టిలు ఎక్కువగా ఇంటి ఖర్చుల కోసం అప్పు చేస్తున్నట్లు వెల్లడైంది.
తెలంగాణలో సగానికి పైగా ప్రజలు తమ రుణావసరాలకు ఇప్పిటికీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులపైనే ఆధారపడుతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరగలేకే ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వాణిజ్య బ్యాంకులు కేవలం 16 శాతం, సహకార సంస్థలు 9.3 శాతం రుణావసరాలను మాత్రమే ఇస్తున్నట్లు తేలింది.
ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు పొందే వారి సంఖ్య 50.6 శాతానికిపైగానే ఉన్నారు. గ్రామాల్లో సహకార బ్యాంకుల నుంచి ఎస్‌టిలు 10.5 శాతం, ఎస్‌సిలు 7.9 శాతం, ఓబిసిలు 15.9 శాతం, ఇతరులు 17.7 శాతంగా ఉన్నారు. వాణిజ్య బ్యాంకుల నుంచి ఎస్‌టిలు 10.1, ఎస్‌సిలు 12.0, ఓబిసిలు 20.1, ఇతరులు 29.3 శాతంగా ఉన్నారు. ఎస్‌హెచ్‌జి (బ్యాంకుకు అనుబంధంగా ఉండే), ఇతరత్రా ఆర్థికపరమైన ఏజెన్సీల ద్వారా, వాణిజ్య, సహకార బ్యాంకులన్ని కలిపినా ఎస్‌టిల్లో 41.9 శాతం మంది రుణాలు పొందుతుండగా, ఎస్‌సిలు 51.2, ఓబిసిలు 67.0, ఇతరులు 56.9 శాతంగా, అందరినీ కలిపితే 59.6 శాతంగా ఉన్నారు. గ్రామాల్లో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల, ఇన్‌పుట్ సప్లయర్స్, బంధు, మిత్రుల నుంచి, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఏజెన్సీల నుంచి, ఇంకా ఇతరత్రా ఆధారాలతో రుణాలు పొందిన ఎస్‌టిల్లో 69.0 శాతం మంది, ఎస్‌సిలు 86.3 శాతం, ఓబిసిల్లో 86.4 శాతం, ఇతరులు 73.6 శాతం, అందరూ 83.1 శాతంగా ఉన్నట్లు తెలిపింది.
పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే సహకార, వాణిజ్య, ఎస్‌హెచ్‌జిల-బ్యాంకు అనుబంధ, ఇతర ఇనిస్టిట్యూషనల్ ఏజెన్సీల నుంచి ఎస్‌టిల్లో 25.2 శాతం, ఎస్‌సిలు 24.8 శాతం, ఓబిసిలు 23.6 శాతం, ఇతరులు 27.4 శాతం, అందరూ 24.9 శాతంగా ఉన్నారు. పట్టణాల్లో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ఇన్‌పుట్ సప్లయర్స్, బంధు, మిత్రుల నుంచి, ఇతర ఆధారాలతో కలిపి ఎస్‌టిల్లో 76.8, ఎస్‌సిల్లో 57.7, ఓబిసిలు 53.8, ఇతరుల్లో 47.6, అందరినీ కలిపితే 53.4 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. వీరిలో రైతులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు, ఉద్యగులూ ఉన్నారు.