తెలంగాణ

ప్రజాస్వామిక హక్కును ఎవరూ హరించజాలరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: ధర్నాలను చేసే ప్రజాస్వామిక హక్కును ఎవరూ కాలరాయలేరని మాజీ డిజిపి, బిజెపి నేత వి దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. ధర్నాలు, ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ ధర్నా చౌక్‌ను తొలగిస్తామని అనడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. తాను 2004-05లో నగర కమిషనర్‌గా ఉన్నసమయంలోనే ధర్నా చౌక్‌ను రూపొందించామని అప్పట్లో నగరంలో ఎక్కడ బడితే అక్కడ ఉద్యమాలు జరుగుతుంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా జరిగేదని, దానిని నివారించేందుకు ప్రజాస్వామిక హక్కులకు భంగం వాటిల్లకుండానే ఉద్యమాలు చేసుకునేందుకు వీలుగా ధర్నా చౌక్‌ను డిజైన్ చేశామని పేర్కొన్నారు. ధర్నా అనేది సామాన్యుల హక్కు అని మరువరాదని, ధర్నా చేయడం వల్ల ఇతరులకు భంగం కలుగకుండా చూడాలని, జనజీవనానికి అంతరాయం కలుగకుండా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని అన్నారు. ధర్నా నిర్వహించరాదని తాము ఆనాడు ఎవరినీ అడ్డుకోలేదని, కాకపోతే దానిని నియంత్రించామని అన్నారు. తెలంగాణలో ఉద్యమాలు చేసినపుడు అధికార పార్టీ కార్యకలాపాలను ఎన్నడూ అడ్డుకోలేదని, గణేష్ నిమజ్జనం సమయంలో ట్యాంకుబండ్‌పై మార్చ్ చేస్తామని అంటే ప్రజలకు అసౌకర్యం కనుక దానిని వేరో చోట అనుమతించిన విషయాన్ని మరువరాదని అన్నారు. కాగా తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపిపై సూమోటో కింద కేసు నమోదు చేయాలని దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసినట్టవుతుందని గుర్తుంచుకోవాలని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ధర్నా అనేది లేకుండా చూస్తామని కెసిఆర్ ఆనాడు హామీ ఇచ్చారని , అంటే దాని అర్ధం ధర్నా చౌక్‌ను తీసేస్తామని అంటారని అనుకోలేదని మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడంలో విఫలమైందని పార్టీ ప్రధానకార్యదర్శి సాంబమూర్తి వ్యాఖ్యానించారు.