తెలంగాణ

బిసి కార్పొరేషన్, ఫెడరేషన్లకు నిధులు కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: అసెంబ్లీలో సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు బిసి కార్పొరేషన్, 10 బిసి ఫెడరేషన్లకు నిధులు కేటాయించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత మూడేళ్లగా బిసి కులాలు తమ వృత్తుల కోసం ఫెడరేషన్లకు దాదాపు లక్షా 60 వేల మంది చేసుకున్న దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని అన్నారు. కృష్ణయ్య సిఎం కెసిఆర్‌కు శనివారం లేఖ రాశారు. బిసి కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు కేటాయించాలని, గీత కార్పొరేషన్‌కు రూ.1500 కోట్లు, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్‌కు రూ.500 కోట్లు, శాలివాహన, కుమ్మర ఫెడరేషన్‌కు రూ.200 కోట్లు, వాల్మీకి/ బోయ ఫెడరేషన్‌కు రూ.300 కోట్లు, వడ్డెర ఫెడరేషన్‌కు రూ.200 కోట్లు, బట్రాజు ఫెడరేషన్‌కు రూ.200 కోట్లు, మేదర ఫెడరేషన్‌కు రూ.200 కోట్లు, పూసల ఫెడరేషన్‌కు రూ.200 కోట్లు, ఉప్పర/సగర ఫెడరేషన్‌కు రూ.200 కోట్లు, మేర ఫెడరేషన్లకు రూ.200 కోట్లు బడ్జెట్ కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.