తెలంగాణ

పనులు వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్న పనులపై జనరల్ మేనేజర్ వినోద్‌కమార్ యాదవ్ రైల్వే అధికారులతో సమీక్షించారు. శనివారం రైల్ నిలయంలో జరిగిన సమావేశంలో ముఖ్య పరిపాలనాధికారి ఆర్‌సి భూల్‌చందాని పాల్గొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని జిఎం వినోద్‌కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, ట్రాక్ డబ్లింగ్ పనులు కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు వంటి అంశాలపై ఆయన చర్చించారు. 2017-18 సంవత్సరానికి గానూ తలపెట్టిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల వసతులు, రైళ్ల సమయ పాలన, ట్రాఫిక్ సమస్యలు, లెవెల్ క్రాసింగ్‌లపై సీరియస్‌గా తీసుకున్నారు. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా పరస్పర సహకారంతో పనులు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చీఫ్ ఇంజనీర్ ఎస్‌ఎన్ సింగ్, చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఎంఎస్ మహబూబ్ అలీ, ఇంజనీర్ అర్జున్ ముండియా, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ జాన్ థామస్ తదితరులు పాల్గొన్నారు.
రైల్వే సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న

చిత్రం.. దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్