తెలంగాణ

పథకాల లబ్ధి ప్రజలకు చేరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: త్వరలో జరిగే తెలంగాణ తొలి తెలుగు ప్రపంచ మహాసభలను గొప్పగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేయడంలో తెలంగాణ గొప్ప పాత్ర పోషించిందని, అదంతా మహాసభల్లో ప్రతిబింబించాలని అన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనం ప్రజలకు అందే విధంగా రచనలు చేసి చైతన్య పరచాలని కవులు, దర్శకులు, రచయితలను ముఖ్యమంత్రి కోరారు. దాదాపు ఏడు గంటల పాటు ప్రగతి భవన్‌లో వారితో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఆట-పాటది గొప్ప పాత్రని, ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా అంతటి మహోన్నత పాత్ర పోషించాలని అన్నారు.
వ్యవసాయాభివృద్ధి, సంక్షేమంపై తాము రచనలు చేస్తామని, డాక్యుమెంటరీలు రూపొందిస్తామని సమావేశానికి హాజరైన పలువురు తెలిపారు. కెసిఆర్ మాటలే పల్లవులుగా పాటలు రాశానని ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజ తెలిపారు. తాను దాదాపు అన్ని పార్టీలకు పాటలు రాశానని, టిఆర్‌ఎస్ పార్టీకి మాత్రం రాయలేక పోయానని సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. కెసిఆర్ ఏదైనా చేస్తే మొదట అపోహలు ఏర్పడతాయి, తర్వాత ఊహలా అనిపిస్తుంది, తర్వాత ఉద్యమ రూపం తీసుకుంటుందని, చివరకు ఆదే ఊపిరిగా మారుతుందని, చివరకు నిజం అవుతుందని అనంత శ్రీరామ్ అన్నారు. గ్రామాల్లో మార్పు వచ్చిందని, చెరువులు నిండాయని మిట్టపల్లి సురేందర్ అన్నారు. సాయుధ పోరాటంలో పాల్గొన్న తన తండ్రి తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నారని, ఆ కలను కెసిఆర్ నిజం చేశారని నటుడు ఉత్తేజ్ అన్నారు. ప్రజల కోరికలను గమనించి, వారి అవసరాలను గుర్తించి, ఆ మేరకు కార్యక్రమాలు రూపొందిస్తున్నారని ప్రముఖ ప్రజాకవి గోరటి వెంకన్న తెలిపారు. కెసిఆర్‌తో కలిసి ఉద్యమంలో అనేక పాటలు రాశామని, అదే స్ఫూర్తితో ఇప్పుడు పాటలు రాస్తానని గోరటి వెంకన్న తెలిపారు. బంగారు తెలంగాణకు తమ వంతు కృషి చేస్తానని జాతీయ అవార్డు గ్రహీత తరుణ్ భాస్కర్ తెలిపారు. తానొక ఎలక్ట్రికల్ ఇంజనీర్‌నని, కరెంటు సమస్యలు తనకు తెలుసునని ఈ విషయంలో కెసిఆర్ అద్భుతం చేశారని, కెసిఆర్ ఏదైనా సాధించగలరు అనడానికి ఇదో నిదర్శనం అని సినీ దర్శకుడు సాగర్ చంద్ర అన్నారు.

చిత్రం..శనివారం ప్రగతిభవన్‌లో కవులు, దర్శకులు, రచయితలతో సమావేశమై ముచ్చటిస్తున్న సిఎం కెసిఆర్