తెలంగాణ

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, మే 13: తెలంగాణ రాష్ట్రంలో 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. శనివారం భూపాలపల్లిలో మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మిర్చిని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్యా హ్నం నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు.
ఈ సందర్భంగా దీక్షా స్థలంలో కార్యకర్తలను ఉద్దేశించి టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులకు రూ. 2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పా రు. నిరుద్యోగ యవతకు ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు రూ. 3వేలు అందిస్తామని తెలిపారు. వృద్ధులకు, వితంతువులకు పింఛను పెంచబోతున్నట్టు ప్రకటించారు. రైతులు తాము పండించిన పంటలకు రాష్ట్రం ప్రభుత్వం నుండి బోనస్ అందించి కొనుగోలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో రైతు ల ఉద్యమం ఉద్ధృతమై హింస వైపు వెళ్లక ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు మేల్కొని మద్దతు ధరతో మిర్చిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల ఫలితంగానే కేంద్రం దిగి వచ్చిందన్నారు. మద్దతు ధర ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మిర్చిని కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తోందన్నారు. మిర్చి రైతులను ఆదుకునేందుకు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించి రూ. 12వేల చొప్పున కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. అదేవిధంగా 2014లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమ, రక్షణ, హక్కులకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పారు. తాడిచెర్ల బ్లాక్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తెలిపారు. సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని శాసనసభలో డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చే ఖరీఫ్‌లో రైతులకు రూ. 4వేలు ఇస్తామని చెబుతున్నారని అది కేవలం ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ ఖరీఫ్‌కు ఎందుకు రైతులకు ఇవ్వరని ప్రశ్నించారు. ఒక పక్క రైతులు మద్దతు ధర లేకపోవడంతో నిరాశనిస్పృహలలో ఉంటే వచ్చే సంవత్సరం ఇస్తామని అనడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఈ ఖరీఫ్‌కు రైతులకు రూ. 4వేలు రైతు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపి రాపోలు అనందభాస్కర్, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, ఆరెపెల్లి మోహన్, మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు, ఇనగాల వెంకట్రాంరెడ్డి, పోడం వీరయ్య, కె. శ్రీ్ధర్, ఆరోగ్యం, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

చిత్రం.. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి నిరాహార దీక్షను విరమింప చేస్తున్న టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి