తెలంగాణ

అక్రమ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14:అక్రమ రేషన్ బియ్యం వ్యవహారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్ఫోర్స్ విభాగంతో మంచి ఫలితాలు వస్తున్నాయని పౌరసరఫరాల శాఖ కమీషనర్ సివి ఆనంద్ తెలిపారు.
ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 179ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు, తనిఖీలు జరిపి, క్రిమినల్ కేసులతో పాటు 56 ఇతర కేసులు నమోదు చేశారు. కోటి రూపాయల విలువ చేసే 3,507 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 937 క్వింటాళ్ల సిఎంఆర్ ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన 2.15లక్షల రూపాయల విలువగల చక్కెర, ఎల్‌పిజి సిలెండర్లు, కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఆనంద్ తెలిపారు. ఆకస్మిక తనిఖీలతో ధాన్యం, సన్నబియ్యం, రేషన్ బియ్యం, మూడు కోట్ల 16 లక్షల 73వేల రూపాయల విలువైన అక్రమాలను నివారించగలిగినట్టు చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ వల్ల మిల్లర్ల నుంచి బియ్యం కూడా సకాలంలో వచ్చిందని చెప్పారు. ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగం మండల స్థాయిలో గోదాములు, రేషన్ షాపులు, సిఎంఆర్ మిల్లులు, మధ్యాహ్నా భోజనం కోసం సన్న బియ్యం అందుకనే సంస్థలు, హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, ఎల్‌పిజి గోదాములు, ఇతర రాష్ట్రాలకు రేషన్ బియ్యం రవాణా చేస్తున్న వాహనాలు, రైళ్ల వంటి పలు ప్రదేశాల్లో ఆకస్మిక దాడులు జరిపినట్టు చెప్పారు. ఆక్రమాలు బయటపడిన చోట క్రమశిక్షణ చర్యల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు.