తెలంగాణ

‘జ్ఞాపకాల వరద’ పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, మే 14: సీనియర్ పాత్రికేయులు, డాక్టర్ వరదాచారి రచించిన జ్ఞాపకాల వరద పుస్తకాన్ని ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. వయోధిక పాత్రికేయ సంఘం, ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రభుత్వ సలహదారు కెవి రమణచారి అధ్యక్షత వహించగా విశిష్ట అతిధిగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, గౌరవ అతిధిగా రాజ్యసభ సభ్యులు కె.కేశవరావులు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ నిరాడంబర జీవితం, ఉన్నత ఆలోచనలు కలిగిన వ్యక్తి వరదాచారి అని, ఆయన రాసిన జ్ఞాపకాల వరద ఒక మహాసముద్రమని అన్నారు. సుమారు 6 దశాబ్దాల పాటు వేలాది మంది వ్యక్తులను, సంఘటనలు చూసిన వరదాచారి తన జీవితానుభవాల ఆధారంగా ఈ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. పేదరికంలోనూ చదువును వదలని వరదాచారి రజాకార్ల ఆగడాలను తన జ్ఞాపకాల్లో ప్రస్తావించారన్నారు. ఏమి రాని జర్నలిస్టులు విలాసవంతంగా జీవిస్తుండగా, అన్ని తెలిసిన జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని దత్తాత్రేయ తెలిపారు. ఎంపి కేశవరావు మాట్లాడుతూ మీడియాలో నిన్నటి తరంలో ఉన్న విలువలు నేటి తరంలో కనిపించడం లేదన్నారు. దేశంలో జరుగుతున్న సంఘటనలపై మీడియా పూర్తిగా వౌనంగా ఉండటం లేదా అతిగా స్పందించడం సరికాదన్నారు. నాటి కాలమాన పరిస్థితులను తెలుసుకునేందుకు వరదాచారి రచించిన జ్ఞాపకాల వరద ఉపయోగపడుతుందన్నారు. విలువలతో పాత్రికేయ వృత్తిలో కొనసాగిన వరదాచారి నేటి తరం జర్నలిస్టులకు ఆదర్శప్రాయుడని అన్నారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఉన్నత విద్యను పూర్తిచేసి, ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉన్నా, జర్నలిజంపై మక్కువతో పాత్రికేయ రంగంలోకి ప్రవేశించిన మహోన్నత వ్యక్తి వరదాచారి అని డాక్టర్ గోవిందరాజుల చక్రధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.రామచంద్రమూర్తి, శ్రీనివాస్, ఎస్. వీరయ్య, ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు రాజవౌళిచారి పాల్గొన్నారు.

చిత్రం..పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కేశవరావు తదితరులు