తెలంగాణ

సెల్‌ఫోన్ మెసేజ్ తో ఆగిన పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, మే 14: సెల్‌ఫోన్ మెసేజ్ కారణంగా మరికొద్ది సేపట్లో జరగవలసిన పెళ్లి ఆగిపోయింది. వరంగల్ నగరంలోని వంద ఫీట్ల రోడ్డులోని ఒక ఫంక్షన్ హాలులో శనివారం రాత్రి అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... వరంగల్ నగరంలోని రామన్నపేటకు ప్రాంతానికి చెందిన యువతికి, విజయవాడకు చెందిన భరత్ శ్రీనివాస్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. 40 రోజుల కిందట తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు. శనివారం అర్ధరాత్రి పెళ్లి జరగవలసి ఉండగా వధువు సెల్‌ఫోన్‌కు సునీత అనే యువతి పేరిట మెసేజ్ వచ్చింది. వరుడు భరత్ శ్రీనివాస్‌తో తనకు ఐదేళ్లుగా సంబంధం ఉందని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడని ఆ యువతి మెసేజ్ ద్వారా సమాచారం ఇచ్చింది. దీంతో ఏమీ పాలుపోని వరంగల్ యువతి విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలపగా వధువు కుటుంబ సభ్యులు జరగాల్సిన వివాహాన్ని ఆపివేసారు. జరిగిన మోసంపై సుబేదారి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో భరత్ శ్రీనివాస్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన భరత్ శ్రీనివాస్ విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసేవాడని, ఆ క్రమంలో సునీత అనే అమ్మాయితో ప్రేమ వ్యవహారం కొనసాగించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని, ఇప్పుడు వరంగల్‌కు చెందిన యువతితో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని సుబేదారి పోలీసులు తెలిపారు.

చిత్రం..వరుడు భరత్ శ్రీనివాస్