తెలంగాణ

ఆటోలోనే గర్భిణి ప్రసవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిప్పర్తి, మే 14: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పురిటినొప్పులతో వచ్చిన గర్భిణికి వైద్య సహాయం అందించేందుకు వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో మరో ఆసుపత్రికి వెళ్తుండగానే ఆటోలోనే శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆకిటి అన్నపూర్ణ (30) అనే మహిళ ప్రసవానికి తల్లిగారి ఇల్లయన తిప్పర్తికి వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు ఆదివారం మధ్యాహ్నం 2గంటల సమయంలో పురిటినొప్పు లు తీవ్రమవ్వడంతో అందుబాటులో ఉన్న ఆశా వర్కర్ పార్వతమ్మతో కలిసి తిప్పర్తి పిహెచ్‌సికి చేరుకుంది. అయి తే ఆరోగ్య కేంద్రంలో డాక్టర్, ఇతర వైద్య సిబ్బంది ఎవరు కూడా లేకపోవడంతో ఆటోలో నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రికి బయలుదేరారు. అన్నపూర్ణకు నొప్పుల అధికమై ఆటోలోనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వెంట ఉన్న ఆశావర్కర్ పార్వతమ్మనే పురుడు పోసింది. కాగా, విషయం తెలుసుకున్న తిప్పర్తి జడ్పీటిసి తండు సైదులు తిప్పర్తి పిహెచ్‌సికి వెళ్లి తనిఖీ చేశారు. ఆసుపత్రిలో డాక్టర్, సిబ్బంది ఎవరు కూడా లేకపోవడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆటోలో ప్రసవానంతరం ఇంటికి చేరుకున్న తల్లీబిడ్డల్ని సైదలు పరామర్శించారు.

చిత్రం..ఆటోలోనే ప్రసవించిన అన్నపూర్ణ