తెలంగాణ

ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్కతుర్తి, మే 14: వరంగల్ అర్భన్ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఎల్కతుర్తి పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నం ఈతకు వెళ్లి చెరువులో దిగి మృతి చెందారు. గూడెం జ్యోతివర్ధన్ (15) ఎల్కతుర్తి మోడల్ స్కూళ్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు, గూడెం సాయికృష్ణ (13) ఖాజీపేట మండలం మడికొండలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు, గూడెం మనోజి (13) తిమ్మాపూర్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ ముగ్గురు విద్యార్థులు మొండికుంట చెరువులోకి ఈతకువెళ్లగా గతంలో పూడికతీత పనులు తీయగా అందులో చిక్కుకొని మృతి చెందారు. మృతదేహాలను వెలికితీసి వరంగల్ ఎంజిఎంకు పోస్టుమార్టంకు పంపి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్కతుర్తి హెడ్‌కానిస్టేబుల్ మహేందర్ తెలిపారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారు. మృతులంతా ఆయా తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకులు కావడంతో వారి రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామస్థులు చలించిపోయారు. ఈ సంఘటనతో తిమ్మాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. విద్యార్థులు మృతి చెందారని తెలియగానే ఖాజీపేట ఎసిపి జనార్ధన్ గ్రామాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాలకు టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.