తెలంగాణ

ఏడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలనేది లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: రాష్ట్రంలో భూముల సర్వేకు సంబంధించి ఆధునిక విధానాల్లో చేపట్టిన కార్యక్రమం ‘్భభారతి’ (ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం-ఐఎల్‌ఐఎస్) నత్తనడకన కొనసాగుతోంది. ఏడేళ్లలో పూర్తి చేయాలని తలపెట్టి 2006లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించిన ఈ ప్రాజె క్టు న్యాయపరమైన అంశాలతో పాటు అనేక సమస్యలు, ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఇప్పుడిప్పుడే గాడిలో పడ్డది. 2006లో ‘పైలట్ ప్రాజెక్టు’ విధానంలో నిజామాబాద్ జిల్లాలో భూభారతి చేపట్టేందుకు ఎంపిక చేసినప్పటికీ, పదకొండేళ్లయినా ఈ జిల్లాలో సర్వే పూర్తికాలేదు. రెండేళ్లలో నిజామాబాద్ జిల్లా లో ఏరియల్ సర్వేద్వారా భూముల సర్వే పూర్తి చేసి, ఆ తర్వాత మిగతా జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని భావించారు. 11 ఏళ్లు పూర్తయినా నిజామాబాద్ జిల్లాలోనే ఇది పూర్తి కాలేదు. తాజా సమాచారం ప్రకా రం ఈ సంవత్సరం చివరి వరకు నిజామాబాద్ జిల్లాలో భూభారతి పూర్తవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
భూభారతిలో భూముల సర్వేకు సంబంధించి ప్రధాన భూమిక పోషించేందుకు స్పెక్ సిస్టం, విప్రో కంపెనీలతో కూడిన కన్సార్టియంకు పదేళ్ల క్రితమే బాధ్యతలను అప్పగించారు. ఈ కన్సార్టియం తన బాధ్యతలను సరిగ్గా నెరవేర్చలేదు. దాంతో ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలంటూ సర్వే సెటిల్‌మెంట్ శాఖలో భాగమైన భూభారతి సొసైటీ ఒత్తిడి తేవడంతో ఈ కన్సార్టియం 2012లో కోర్టుకు వెళ్లింది. కోర్టులో 2015 వరకు ఏమీ తేలలేదు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకునేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో కన్సార్టియం వల్ల పనికాదని భావించిన ప్రభుత్వం భూభారతి కార్యక్రమం నుండి కన్సార్టియంను తప్పించి, తెలంగాణ రిమోట్ అప్లికేషన్స్ సెంటర్‌కు (టిఆర్‌ఎసి) బాధ్యతలను అప్పచెప్పింది. నిరుడు ఏప్రిల్‌లో తెలంగాణ రిమోట్ అప్లికేషన్స్ సెంటర్ బాధ్యతలు చేపట్టి వేగంగా పనులు చేస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. నిజామాబాద్ జిల్లాలో 911 గ్రామాలు ఉండగా అన్ని గ్రామాల్లోనూ సర్వే జరుగుతోంది. నిజామాబాద్‌లో ఈ ప్రాజెక్టు పనులు కొనసాగుతుండగానే మిగతా జిల్లాల్లో కూడా భూభారతిని చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా మరికొంత మంది ఉన్నతాధికారులను సభ్యులు గా జిల్లాస్థాయి కమిటీలను తెలంగాణ వ్యాప్తంగా నియమించారు. రాష్టస్థ్రాయిలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఎ) చైర్మన్‌గా ఏడుగురు సీనియర్ ఐఎఎస్ అధికారులతో కమిటీ పనిచేయాల్సి ఉంది. ఏడాది కాలంగా సిసిఎల్‌ఎ లేకపోవడంతో భూభారతికి సంబంధించి ఒక్క మీటింగ్ కూడా జరగలేదు. సర్వేసెటిల్‌మెంట్, ల్యాం డ్ రికార్డ్స్ కమిషనర్ వైస్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీ త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కేంద్ర సాయం..
రాష్ట్ర ప్రభుత్వం భూభారతిపేరుతో చేపట్టిన పథకం ఒకవైపు కొనసాగుతుండగానే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భూముల సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ‘డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మాడర్నైజేషన్ ప్రోగ్రాం’ పేరుతో చేపట్టే ఈ పథకంలో సర్వే, డిజిటలైజేషన్ పనులు చేపడతారు. ఈ ప్రాజెక్టుకోసం 256 కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేస్తూ, ఆధునిక విధానాల్లో సర్వే చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.