తెలంగాణ

రైతాంగాన్ని నట్టేట ముంచిన కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: రాష్ట్రప్రభుత్వం రైతాంగ సమస్యలను సకాలంలో తీర్చడంలో ఘోరంగా విఫలమై వారిని నట్టేట ముంచిందని బిజెపి జాతీయ నాయకుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలో రైతలపై పోలీసుల దాడి, రైతులను సంకెళ్లతో తీసుకువెళ్లడం పట్ల రాష్టవ్య్రాప్తంగా ప్రజల్లో నిరసన వ్యక్తం కావడంతో మగాడు అన్నవాడు అలా చెయ్యడు అంటూ ఇపుడు సానుభూతి పొందే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారని ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. పోలీసులు అత్యుత్సాహంతో అలా చేస్తే ముఖ్యమంత్రి డైరెక్షన్ లేకుండా రైతులపై కేసులు పెడతారా ఒకే సంఘటనపై ఒకే రైతుపై నాలుగు కేసులు పెడతారా అని నిలదీశారు. తనకు సంబంధం లేకుండా ఈ సంఘటన జరిగిందని అని చెబుతున్న ముఖ్యమంత్రి ఈ అక్రమ కేసులను ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు. ప్రజలను మభ్య పెట్టడం కోసం రోజుకో వేషం వేస్తున్నారని, వెంటనే రైతులపై పెట్టిన అక్రమ కేసులను రద్దుచేయాలని కోరారు. ఒక వంక మిర్చి రైతులను పట్టించుకోని ప్రభుత్వం, మరో వంక వరి ధాన్యం పండించిన రైతులను కూడా పట్టించుకోవడం లేదని, ఎంత ధాన్యం వస్తుందో అంచనా వేసి గోనె సంచులను ముందే ఎందుకు తెప్పించుకోవడం లేదని అన్నారు. ఖాళీ సంచులు లేక ధాన్యం వానకు తడిసి పాడవుతుంటే దానికి ఎవరు బాధ్యత వహించాలని అన్నారు. ధాన్యం ఐకెపి కేంద్రానికి రైతులు తెచ్చిన తర్వాత ఎలాంటి నష్టం జరిగినా రాష్ట్రప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.
నిజామాబాద్‌లో మార్కెట్ యార్డులో తన పసుపు కుప్పపై ఒక పసుపు రైతు మృతి చెందితే మంత్రికానీ ఆ పార్టీ నేతలు కాని పట్టించుకోకపోవడం దారుణమని ఇంద్రసేనారెడ్డి అన్నారు. రైతులకు భూసార పరీక్ష కార్డులు ఇస్తామని సిఎం అబద్దాలు చెబుతున్నారని, నిరసనలు తెలిపిన వారిపై టిఆర్‌ఎస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో మిర్చి రైతులకు బేడీలు వేసిన సంఘటనపై నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న బిజెపి యువమోర్చ జిల్లా అధ్యక్షుడిని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో చెయ్యి విరిగిపోయిందని, నిరసన కార్యక్రమాలను చూసి కెసిఆర్ భయపడుతున్నారని అన్నారు. ప్రత్యర్ధులను అణచివేయాలని అప్రజాస్వామికం వ్యవహరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని , నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని అన్నారు. రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, దాడులకు పాల్పడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని అన్నారు.