తెలంగాణ

పుస్తకం ఓ మంచి మిత్రుడు: దత్తాత్రేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: పుస్తకం మన హితం కోరే మంచి మిత్రునితో సమానమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాలని తెలిపారు. దీన్‌దయాల్ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న బుక్ ఫెయిర్ ముగింపు కార్యక్రమానికి సోమవారం ముఖ్య అతిథిగా హాజరై దత్తాత్రేయ ప్రసంగించారు. ఈ రోజుల్లో పుస్తకాలు చదివే అలవాటు అందరిలో కొరవడిందని, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు పెరిగిన తర్వాత పుస్తకాలు చదివే వారు తగ్గిపోయారని అన్నారు. శుభకార్యాల సమయంలో బహుమతిగా పుస్తకాన్ని ఇవ్వడంలో మించిన బహుమతి లేదని అన్నారు. ఎంతో శ్రమకోర్చి బుక్‌ఫెయిర్‌ను నిర్వహించిన నిర్వాహకుడు డిఆర్‌ఎస్ నరేంద్రను కేంద్రమంత్రి అభినందించారు. నరేంద్ర రచించిన మన మహనీయులు ఆంగ్ల ప్రతిని భాజాపా అమిత్‌షా చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు కృషి చేస్తాస్తానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ అధికార భాషా సంఘం చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్‌రావు విశిష్ట అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

.