తెలంగాణ

పిఇసెట్ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న పిఇసెట్ వాయిదా పడింది. ఈ నెల 29 నుండి జరగాల్సిన శారీరక దారుఢ్య పరీక్షలు జూన్ 5 నుండి నిర్వహించనున్నట్టు పిఇసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వి సత్యనారాయణ తెలిపారు. వాయిదా నేపథ్యంలో దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 22 వ తేదీ వరకూ పొడిగించామని ఆయన చెప్పారు. ఆలస్య రుసుంతో జూన్ 1వ తేదీ వరకూ సమర్పించవచ్చని చెప్పారు.
ఆన్‌లైన్ దరఖాస్తులు ఇంతవరకూ 6737 వచ్చాయి. అందులో పురుషులు 5144, స్ర్తిలు 1588 మంది ఉన్నారని కన్వీనర్ పేర్కొన్నారు. ఇంత వరకూ బిపెడ్ కోసం 3488, డిపెడ్ కోసం 3249 దరఖాస్తులు వచ్చాయి, ఈ నెల 25 నుండి హాల్‌టిక్కెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.