తెలంగాణ

కెసిఆర్ కిట్లను సిద్ధంచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: అన్ని జిల్లాల్లో కెసిఆర్ కిట్ల పంపిణీకి సర్వం సిద్దం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం కెసిఆర్ కిట్లపై సచివాలయం నుంచి వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కిట్ల పంపిణీ సందర్భంగా జిల్లా ఆసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో లబ్దిదారులకు ఇబ్బంది కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇంత వరకు 1,80,000 గర్భిణిలు రిజిష్టర్ అయినట్లుగా ఆయన తెలిపారు. రానున్న రెండు మూడు నెలల్లో వీటి సంఖ్య 20 నుంచి 30 శాతం పెరిగే అవకాశం ఉందని అన్నారు. కిట్ల పంపిణీకి అనుగుణంగా డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. కెసిఆర్ కిట్ల పథకానికి సంబంధించి రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను కలెక్టర్లకు వీడియో కానె్ఫరెన్సు ద్వారా ప్రదర్శించారు. ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను చేసుకున్న వారికి కిట్‌తో పాటు మగ శిశువుకు రూ.12 వేలు, ఆడ శిశువుకు రూ.13 వేలు నాలుగు విడతలుగా చెల్లిస్తారని తెలిపారు. ఆధార్ కార్డు, బ్యాంక్ అక్కౌంట్ అనుసంధానం ద్వారా లబ్దిదారుల ఖాతాలకు నేరుగా చెల్లిస్తారని సిఎస్ స్పష్టం చేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకటి కరుణ పాల్గొన్నారు.