తెలంగాణ

డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ అడ్మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: డిగ్రీ కాలేజీల్లో ఈ ఏడాది ఆన్‌లైన్ అడ్మిషన్లు చేపట్టనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటాచలం, ప్రొఫెసర్ మల్లేశంలు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని 1167 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో 4.09 లక్షల సీట్ల భర్తీకి ఆన్‌లైన్ వెబ్ ఆధారిత అడ్మిషన్లకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. వివిధ సొసైటీల్లోని గురుకుల డిగ్రీ కాలేజీలకు మాత్రం వేరుగా అడ్మిషన్లు ఉంటాయన్నారు. రాష్ట్రంలోని ఆరు సంప్రదాయ వర్శిటీల పరిధిలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు వంద రూపాయిలు చెల్లించి ఈ-సేవ, మీ సేవ, హెల్ప్‌లైన్ సెంటర్లలో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. వెబ్ ఆప్షన్లకు ఈనెల 18 నుండి జూన్ 4 వరకూ గడువు ఉంటుందని, 200 రూపాయిల అదనపు రుసుంతో జూన్ 5, 6 తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. సీట్ల కేటాయింపు జూన్ 10న జరుగుతుందని, సీట్లు పొందిన వారు జూన్ 12 నుంచి 17లోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు. రెండో దశ సీట్ల కేటాయింపు జూన్ 22న జరుగుతుందని, అభ్యర్థులు 23 నుండి 28 మధ్య ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చివరి దశ వెబ్ ఆప్షన్లు జూన్ 29, 30 తేదీల్లో ఉంటుందని, తుది దశ సీట్ల కేటాయింపు జూలై 3న జరుగుతుందని, వారంతా ఆయా కాలేజీల్లో జూలై 4 నుండి 7లోగా రిపోర్టు చేయాల్సి ఉంటుందని చెప్పారు. తరగతులు జూన్ 19 నుండి ప్రారంభమవుతాయని వివరించారు.
రహస్యంగా ఫీజుల బాదుడు
కాలేజీల్లో చేరే విద్యార్థులు సహజంగా ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజు అకౌంట్ల కింద ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ రెండు అకౌంట్ల పేర్లు లేకుండా యూనివర్శిటీలు అదర్ ఫీజు పేరుతో కొత్త అకౌంట్ తెరిచాయి. దానికింద ఎంత ఫీజు అయినా చెల్లించమని డిమాండ్ చేసే అధికారం యూనివర్శిటీలు ఉంచుకున్నాయి. ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజులు పెంచితే ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని తప్పించుకునేందుకు ప్రభుత్వం అదర్ పేరిట ఫీజులను పెంచుకునే అవకాశం యూనివర్శిటీలకు కల్పించింది. దాంతో యూనివర్శిటీలు డిగ్రీ కాలేజీల్లో ప్రస్తుత ఫీజునకు అదనంగా 24వేలు వసూలు చేసుకునే వీలుకలిగింది. ఉస్మానియాలో ఈ ఫీజు 24వేల వరకూ ఉండగా, మిగిలిన వర్శిటీల్లో 7500 వరకూ గరిష్టంగా ఉంది.
విద్యార్థులను కాలేజీల యాజమాన్యాలు ప్రలోభ పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. గుర్తింపు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామన్నారు. విద్యార్థులకు సేవలు అందించేందుకు ఉన్నత విద్యామండలిలో దోస్త్ కార్యాలయంతో పాటు 120 హెల్ప్‌లైన్ సెంటర్లు పెట్టామన్నారు.