తెలంగాణ

పెన్షన్ దరఖాస్తుకు గడువు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: తెలంగాణ రాష్ట్రంలో ఒంటరి మహిళలకు అందించే పెన్షనకు దరఖాస్తు చేసుకునేవారికి ఈ నెల 21వ తేదీ వరకు గడుపు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన ప్రతిఒక్కరికి ఈ పెన్షన్ అందించే దిశగా ప్రయత్నించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
సోమవారం నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జూన్ రెండో తేదీ నాటికి పెన్షన్ల పంపిణీకి సిద్ధంగా ఉండాలని కూడా ఆదేశించారు. ఇపిఎఫ్ ఖాతా ఉన్న బీడీ కార్మికులంతా బీడీ కార్మికుల పెన్షన్‌కు అర్హులని, ఇందులో కుటుంబం ఒక యూనిట్‌గా పరిగణించబడుతుందని ఆయన వెల్లడించారు. మిషన్ భగీరథ పనుల్లో ఇంటర్ విలేజ్ పనులు జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించి నివేదికను పంపాలని ఆదేశించారు. ఈ వేసవి సమయంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.