తెలంగాణ

ఇక హైటెక్ బస్ టర్మినెళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: సికిందరాబాద్ రైల్వేస్టేషన్‌లో బస్సు టర్మినెళ్లు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బస్సు టర్మినెళ్లను తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రయాణికులు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా టర్మినెళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ యోచిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఓ కమిటీని ఇటీవలే వేసింది. దక్షిణ మధ్య రైల్వే సికిందరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రోజూ 238 రైళ్లు నడుపుతూ 1.75 లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. అయితే నగరం నలుమూలలనుంచి వచ్చే బస్సులు సికిందరాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో నిలుస్తున్నాయి. రైల్వే స్టేషన్ ముందు బస్సులు ఆగుతుండడంతో రైల్వే ప్రయాణికులు అవస్థల పాలవుతున్నారు. స్టేషన్ బయటకు వెళ్లాలన్నా.. రావాలన్నా.. వాహనాలతోపాటు పాదచారులు సైతం అడ్డంగా వస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జాం అయ్యే పరిస్థుతులు కూడా ఎదురవుతున్నాయి. ఈ విషయంపై ట్రాఫిక్, ఆర్టీసీ, రైల్వే, జిహెచ్‌ఎంసి, మెట్రో విభాగాలు దృష్టి సారించాయి. విశ్వనగరంగా వ్యాప్తి చెందుతున్న నగరంలో ఆ స్థాయి మేరకు బస్సు టర్మినెళ్లను అభివృద్ధి చేయాలని అధికారులు సంకల్పించారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్వే, సికాందరాబాద్ స్టేషన్ డైరెక్టర్, ఆర్టీసీ అధికారి కొమురయ్య, ట్రాఫిక్ డిసిపి, జిహెచ్‌ఎంసి అధికారులతో ఓ కమిటీని కూడా వేశారు. వీరంతా పలుమార్లు సమావేశమై రైల్వే స్టేషన్ పరిసరాలు ఎలా ఉండాలనే దానిపై నివేదిక రూపొందించారు. క్షేత్ర స్థాయి అధికారులు పరిశీలించిన తరువాత ఉన్నత స్థాయి అధికారులకు నివేదికను అందజేయనున్నారు. ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమై ఉన్న క్షేత్ర స్థాయి సిబ్బంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉన్నత స్థాయి కమిటీ నివేదిక రూపొందించి ముఖ్యమంత్రికి నివేదించారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభించనున్నట్టు ఓ ఆర్టీసీ ఉన్నతాధికారి తెలిపారు. కొత్త బస్ టర్మినెళ్లు అందుబాటులోకి వస్తే సికిందరాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగి పోతుందని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు