తెలంగాణ

రంజాన్ కోసం ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఎకె ఖాన్, నగర శాసన సభ్యులు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రంజాన్ మాసం ప్రారంభం నుంచి ముగింపు వరకు విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పాతబస్తీలో మంచినీరు, రోడ్ల మరమ్మతు, వీధి దీపాలు, ఎప్పటికప్పుడు చెత్త తొలగించడం, ప్రత్యేక డంపింగ్ బిన్‌లను ఏర్పాటు చేయాలని చెప్పారు. చార్మినార్ ప్రాంతంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మసీదుల మరమ్మతుకు ఐదు కోట్ల రూపాయలు, మక్కా మసీదు మరమ్మతుకు 8.45 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ముస్లింలకు రంజాన్ సందర్భంగా ఒక గంట ముందుగా ఆఫీసు విడిచి వెళ్లడానికి అనుమతి ఇచ్చినట్టు చెప్పారు.