తెలంగాణ

రెచ్చిపోతే చచ్చిపోతరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15:ప్రభుత్వం చేస్తున్న మంచి పనులతో ఇక తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న అక్కసుతో రెచ్చిపోతే చచ్చిపోతారని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి హెచ్చరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి సోమవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. శాంతియుతంగా ధర్నా చౌక్‌లో ధర్నా చేస్తున్న స్థానికులపై దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు. ధర్నా చౌక్ ముట్టడి పేరుతో అన్ని పార్టీలు కలిసి ప్రజలు, పోలీసులపై దాడులు చేశాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఫాసిస్టు, డిక్టేటర్ అని అన్నా తామేమీ అనలేదన్నారు. ధర్నాచౌక్‌ను రద్దు చేస్తామని సిఎం ఎక్కడా చెప్పలేదు, ఇక్కడ కాకుండా మరెక్కడైనా చేస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారని చెప్పారు. హైకోర్టులో పిటిషన్ వేసిన కోదండరామ్ తీర్పు రాకముందే ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు. తీర్పు వచ్చే వరకు ఆగకుండా ఇప్పుడు అందరినీ రెచ్చగొట్టి దాడులు చేయించడం కోదండరామ్‌కు తగదని అన్నారు. సిపిఐ, సిపిఎంలతో పాటు ఈమధ్య వచ్చిన ఆంధ్ర పార్టీ జనసేనలు సమస్యల్లేకుండా ధర్నాలు చేయడం సరైంది కాదని అన్నారు. ఇందిరాపార్క్ వద్ద కాలనీ వాసులు, మార్నింగ్ వాకింగ్‌కు వచ్చే వాళ్లు అక్కడ ధర్నా చౌక్ ఉండవద్దని కోరుతున్నారని హోంమంత్రి చెప్పారు. కాలనీ వాసులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వారిపై దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ గొడవల్లో పోలీసులకు కూడా దెబ్బలు తగిలాయని అన్నారు. స్థానికుల్లో మఫ్టీ పోలీసులు వచ్చారనే విమర్శ నిజం కాదని తామనుకుంటే వెయ్యి మందిని దింపేవాళ్లమని అన్నారు.
ధర్నా చేయడానికి వచ్చిన విపక్ష కార్యకర్తల చేతిలో ఇనుపరాడ్లు, రాళ్లు ఎందుకున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే కాలనీల ప్రెసిడెంట్లకు ఫోన్ చేసి ధర్నాకు ఎవరూ వెళ్లవద్దని కోరినా స్థానిక కాలనీల వాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ధర్నాచౌక్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారని తలసాని తెలిపారు. కమ్యూనిస్టుల వెంట ప్రజలు ఎవ రూ లేరని ఏదో ఒక పార్టీకి తోక పార్టీలుగా మిగిలిపోయాయని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.