తెలంగాణ

దద్దరిల్లిన ధర్నా చౌక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలదే విజయం
ధర్నా చౌక్ ఆక్రమణ కార్యక్రమం శాంతి యుతంగా జరుపుకున్నాం. ఇది ప్రజా విజయం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్థి పలకాలి.
- ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్
ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి
ఇన్ని సంవత్సరాలు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది. ధర్నా చౌక్ తెలంగాణ రాష్ట్ర సాధనకు వేదిక, ఇది లేకుండా తెలంగాణా వచ్చేది కాదన్న విషయం ప్రభుత్వం గ్రహించాలి.
- వి. హనుమంత రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు
ఇది చరిత్రాత్మక విజయం
ధర్నాచౌక్ ఆక్రమణ అన్నది ప్రభుత్వం పై ప్రజలు సాధించిన చారిత్రాత్మక విజయం. ఇప్పటికైనా ప్రజల మధ్య విభేధాలు సృష్టించాలనే ఆలోచనలను ప్రభుత్వం మానుకోవాలి.
- తమ్మినేని వీరభద్రం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
యథాతథంగా కొనసాగించాలి
తెలంగాణ వస్తే స్వేఛ్ఛ వస్తుంది అని ప్రజలు ఆశపడితే ఉన్న స్వేఛ్ఛను కూడా హరించటం అన్యాయం.
- ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
కుట్రలు మానుకోవాలి
శాంతి భద్రతల సమస్యలను సృష్టించి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి ధర్నాచౌక్‌ను ఎత్తివేయాలనే కుట్రలను ప్రభుత్వం మానుకోవాలి.
- రేవంత్ రెడ్డి, తెలుగుదేశం నాయకుడు
ధర్నాలకు అనుమతి ఇవ్వాలి
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రేపటి నుండి ధర్నాలకు అనుమతి ఇవ్వాలి. మనది ప్రజా స్వామ్యం. ప్రజలకు భావప్రకటనా స్వేఛ్ఛ ఉంది.
- చాడ వెంకట్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
ఇది పరిష్కారం కాదు
ధర్నాచౌక్ ను తరలించటం అన్నది సమస్యలకు పరిష్కారం కాదు. స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి వాటిపై చర్చించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి.
- రామచందర్ రావు, బిజెపి ఎమ్మెల్సీ
ఇది ప్రజా అసెంబ్లీ
ధర్నాచౌక్ అన్నది ప్రజల అసెంబ్లీ. సమస్యలపై చర్చించకుండా అసెంబ్లీలో ప్రతి పక్షాల గొంతు నొక్కుతూ ఇక్కడ ప్రజల గొంతుకూడా నొక్కాలని చూడటం అవివేకం.
- పిఎల్ విశే్వశ్వరరావు: ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ కో కన్వీనర్