తెలంగాణ

వెనక్కి తగ్గేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: ‘వెనక్కి తగ్గం...్ధర్నా చౌక్ వద్దే ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తాం..’ అని టి.జెఎసి, ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ నాయకులు తేల్చి చెప్పారు. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌లో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ నాయకులు హిమాయత్‌నగర్‌లోని సిపిఐ కార్యాలయం (మఖ్దూంభవన్)లో సమావేశమయ్యారు.
టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ నాయకులు చాడ వెంకటరెడ్డి, విశే్వశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ(ఎం-ఎల్), పివోడబ్ల్యు, పలు ప్రజా సంఘాల నాయకులు సమావేశమై చర్చించారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు నిర్వహించిన ధర్నా విజయవంతమైందని వారు భావించారు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించారు. ధర్నా చౌక్ పునరుద్ధరణకు ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇవ్వాలని, ఆ తర్వాత ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశానంతరం టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతించడంతో అక్కడికి చేరుకున్న కార్యకర్తలను, ప్రజలను పోలీసులు గొడ్లను బాదినట్లు బాదారని అన్నారు. 35 మంది తీవ్రంగా గాయపడ్డారని, అనేక మంది స్వల్పంగా గాయపడ్డారని ఆయన తెలిపారు. ఆరుగురికి చేతులు, కాళ్ళు విరిగాయని ఆయన చెప్పారు. ఇక మీదట అక్క డే ధర్నాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. అయినా ప్రభుత్వం నిరాకరిస్తే వారం రోజుల తర్వాత తిరిగి సమావేశమై కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. వేషం మార్చి గుండాల్లా ప్రవర్తించిన పోలీసులపై ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. తమకు కోరికలు లేవని, ఇందిరా పార్కును పునరుద్ధరించాలని కోరుతున్నామని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రభుత్వం అతి తెలివి చూపించిందని విమర్శించారు.
కాలనీ వాసుల ముసుగులో మఫ్టీ పోలీసులను దింపిందని ఆయన దుయ్యబట్టారు. వారంతా టిఆర్‌ఎస్ గుండాలని అనాలా? అని ఆయన ప్రశ్నించా రు. కాలనీ వాసుల కోసం ప్రభుత్వమే షామియానాలు వేసి, మైకులు పెట్టించిందని ఆయన విమర్శించారు.
సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తాము శాంతియుతంగా ధర్నా చౌక్ వద్దకు చేరుకుంటే, ఘర్షణ వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పించిందని విమర్శించారు. టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, పోలీసు అధికారులే కాలనీ వాసుల అవతారమెత్తారని చాడ తెలిపారు. మహిళా ఇన్‌స్పెక్టర్, టిఆర్‌ఎస్ కార్పోరేటర్లు కాలనీ వాసుల్లా వస్తే తమ పార్టీ కార్యకర్తలు, మీడియా గుర్తించినట్లు చెప్పారు.

చిత్రం..ఇందిరా పార్కు వద్ద ధర్నాలో అభివాదం చేస్తున్న ప్రొఫెసర్ కోదండరామ్, టిపిసిసి నేత ఉత్తమ్‌కుమార్