తెలంగాణ

టిఎస్‌ఐసెట్‌కు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 18న నిర్వహించే ఐసెట్‌కు భారీ ఏర్పాట్లు చేసినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ కె ఓం ప్రకాష్ తెలిపారు. పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.20 వరకూ జరుగుతుందని ఇందుకోసం 16 పట్టణాల్లో మొత్తం 132 కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. 132 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 36 మంది స్పెషల్ అబ్జర్వర్లను, 150 మంది లోకల్ అబ్జర్వర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్షకు 77422 మంది దరఖాస్తు చేశారని చెప్పారు. పరీక్ష సమయంలో అభ్యర్థుల నుండి బయోమెట్రిక్ సేకరిస్తామని, దానివల్ల ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయకుండా నిరోధించడమేగాక, భవిష్యత్‌లో ఈ రికార్డులను ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఉపయోగిస్తామని అన్నారు. అభ్యర్ధులు గంటన్నర ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు.
టిజి సెట్ ఫలితాలు 18న వెల్లడి
తెలంగాణ సాంఘిక సంక్షేమ , గిరిజన, వెనుకబడిన తరగతుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలను 18న విడుదల చేయనున్నట్టు కన్వీనర్ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీకి గడువు పెంపుటెన్త్‌లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు తమ పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 22 వరకూ గడువు విధించినట్టు పరీక్షల బోర్డు తెలిపింది. 50 రూపాయిల జరిమానాతో 24 వరకూ చెల్లించవచ్చని పేర్కొన్నారు. అభ్యర్ధులు మూడు సబ్జెక్టులు లోపు హాజరైతే 110 రూపాయిలు, 3 సబ్జెక్టులు మించి హాజరైతే 125 రూపాయిలు చెల్లించాలని అన్నారు. చికాగో నగరంలో ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చికాగో షాలిమార్ బాకెట్‌లో సుమారు 700 మంది పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించారు. చికాగోలోని కాన్సులర్ జనరల్ నీతా భూషణ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. వర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం శతాబ్ది ఉత్సవాల విశేషాలు వివరించారు. అమెరికన్ కాంగ్రెస్ నాయకుడు రాజా కృష్ణమూర్తి మాట్లాడుతూ యుఎస్, భారత్ వర్శిటీల మధ్య అనుబంధం పెరగాలని అన్నారు.