తెలంగాణ

తెలుగు వర్శిటీ కోర్సులకు దరఖాస్తుల స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: పొట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీ 2017-18 విద్యాసంవత్సరానికి గానూ వివిధ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హైదరాబాద్, వరంగల్, రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడి ప్రాంగణాల్లో నిర్వహించే పలు కోర్సుల్లో ప్రవేశించడానికి ఈ నెల 17వ తేదీ నుండి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. పోస్టు గ్రాడ్యూయేషన్ కోర్సుల్లో అనువర్తిత భాషా శాస్త్రం, కర్నాటక సంగీతం, జ్యోతిషం, తెలుగు, కూచిపూడి నృత్యం, ఆంధ్రనాట్యం, జానపద కళలు, రంగస్థల కళలు, జర్నలిజం శాఖల్లో ఎంసిజె కోర్సులు, చిత్రలేఖనం శిల్పకళలో బిఎఫ్‌ఎ కోర్సులకు తెలుగు విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటితో పాటు తెలుగు భాషా బోధన- భాషా శాస్త్రం, ట్రావెల్ అండ్ టూరిజం, రంగస్థల కళలు, ఫిల్మ్ డైరెక్షన్, జ్యోతిర్వాస్తు, ఆధునిక నిర్మాణ శిల్పం, జానపద సంగీతం, నృత్యం, వాయిద్యం కోర్సులతో పాటు డిప్లొమో ఇన్ జ్యోతిషం, లలిత సంగీతం, పద్యనాటకం, హరికథ, బుర్రకథ, యక్షగానం, మిమిక్రీ కోర్సులను సర్ట్ఫికేట్ ఇన్ జ్యోతిషం, జానపద సంగీతం, నృత్యం, వాయిద్యం, ఇంద్రజాలం కోర్సులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తులు స్వీకరించేందుకు మే 31 చివరి తేదీ, ఆలస్య రుసుంతో జూన్ 10 వరకూ స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లో పిఎస్‌టియుసెట్ డాట్ ఆర్గ్ అనే వెబ్‌సైట్ చూడాలని, ఇతర వివరాలకు 040-23230435 నెంబర్‌కు ఫొన్ చేయాలని వర్శిటీ పిఆర్‌ఓ చెప్పారు.