తెలంగాణ

ఐటి వౌలిక సదుపాయాలకు 15 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐసిటి) రంగాలకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఐటి పార్కులు, ఐటి సెజ్‌లు, ఐటి క్యాంపస్‌లకు రోడ్లు, విద్యుత్, నీరు, మురుగునీటిపారుదల తదితర వౌలిక సదుపాయాలను అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీని అమలు చేసేందుకు 2017-18 ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెలలకోసం (2017 ఏప్రిల్ నుండి జూన్) 15 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ మేరకు ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ పేరుతో మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. నోడల్ సంస్థగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ (టిఎస్‌ఐఐసి) ఈ నిధులను వినియోగించి, ప్రభుత్వానికి వినియోగ సర్ట్ఫికెట్లు (యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు) అందచేయాలని ఆయన ఆదేశించారు.