తెలంగాణ

గ్రూపు-2 ఫలితాలను ప్రకటించాలి: కృష్ణయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న గ్రూపు-2 సర్వీస్ పరీక్షా ఫలితాలను వెంటనే విడుదల చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టిడిపి ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఏడాది నవంబర్ నెలలో గ్రూపు-2 పరీక్ష నిర్వహించినప్పుడు రెండు నెలల్లో ఫలితాలు ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపిందని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకూ ఫలితాలు ప్రకటించకుండా ప్రభుత్వం జాప్యం చేసిందని ఆయన విమర్శించారు. గ్రూపు-1, 3, 4 సర్వీస్ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రూపు-1లో 1200 ఖాళీలు, గ్రూపు-3లో 2500 ఖాళీలు, గ్రూపు-4లో 35 వేల క్లరికల్ స్థాయి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.