తెలంగాణ

ధాన్యం కుప్పపైనే ప్రాణం విడిచిన రైతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోమకొండ, మే 16: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు తీసుకువచ్చిన ఓ రైతు ఆ ధాన్యం కుప్పపైనే తుదిశ్వాస విడిచాడు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని జనగామ గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ గ్రామానికి చెందిన ఆకుల పోచయ్య (68) అనే రైతు మంగళవారం కొనుగోలు కేంద్రంలోని తన ధాన్యం కుప్పపై ప్రాణాలు విడిచాడు. పక్కనే ఉన్న రైతులు పోచయ్యను లేపడానికి ప్రయత్నించగా మాట్లాడకపోవడంతో మృతి చెందినట్లు భావించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున రైతులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎస్‌ఐ రవిబాబు సంఘటనా స్థలానికి చేరుకుని విలేఖరులతో మాట్లాడారు. పొద్దంతా ఎండలో పోచయ్య పొలం పనులు చేసి సోమవారం రాత్రి ఇంట్లో భోజనం చేసిన అనంతరం గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించేందుకు ఉంచగా అక్కడ కాపలాకు వచ్చాడన్నారు. తెల్లవారేసరికి మృతి చెంది ఉన్న విషయం తెలిసిందన్నారు. మృతుని భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.