తెలంగాణ

టెన్త్, ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, మార్చి 28: కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్ కేంద్రంగా సోమవారం నుండి ప్రారంభమైన ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోంది. పట్టణంలోని ఏడు కేంద్రాల్లో ఈ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అందులో నాలుగ ప్రైవేట్ హైస్కూళ్లలో టెన్త్ కేంద్రాలు, మరో మూడు డిగ్రీ కళాశాలల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. గత కొంతకాలంగా టెన్త్, ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులే ఈసారి పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిసింది. గతంలో ఓపెన్ సెంటర్ నిర్వాహకులు విద్యార్థులను పాస్ చేయిస్తామని ఒక్కో విద్యార్థి నుండి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు సమాచారం. ఆ సందర్భాల్లో మీడియాల్లో కథనాలు రావడం, మరికొంతమంది విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో మాస్‌కాపీయింగ్ జరగకపోవడంతో ఆయా విద్యార్థులకు డబ్బులు వాపస్ చేసినట్లు తెలిసింది. ఈసారి రెగ్యులర్, ఓపెన్ టెన్త్ పరీక్షలు ఒకే సందర్భంలో రావడంతో ప్రభుత్వ పాఠశాలలు ఖాళీగా లేకపోవడంతో ప్రైవేట్ సెంటర్లు పరీక్ష కేంద్రాలుగా మారాయి. ఇదే అదనుగా భావించిన ఓపెన్ స్కూల్ నిర్వాహకులు సెంటర్లను మేనేజ్ చేసి ఓపెన్ పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈసారి మీడియా ప్రభావం పడకుండా ముందుగానే మేనేజ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సారి కూడా పాస్ గ్యారెంటీ పేరుతో ఒక్కో విద్యార్థి నుండి రూ. 10 వేల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. ఇవ్వని ఇలా ఉంటే ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షలకు ఫీజులు చెల్లించే విద్యార్థుల్లో గత కొనే్నళ్లుగా సగానికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకాకపోవడం గమనార్హం. ఈసారి ఓపెన్ పరీక్ష కేంద్రాల్లో ఒక్కో సెంటర్ సగటున 102 మంది విద్యార్థులకు సెంటర్ కేటాయిస్తే 97, 98 మంది విద్యార్థులు తొలిరోజు హాజరయ్యారంటే పాస్ గ్యారంటీ పథకమే కారణం కావచ్చునని సర్వత్రా చర్చ జరుగుతోంది.