తెలంగాణ

ఉపాధిహామీ ఆస్తుల ‘మ్యాపింగ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) పనులన్నింటినీ, ఆస్తులన్నింటినీ ‘జియో మ్యాపింగ్’ చేయాలని నిర్ణయించారు. రంగారెడ్డి, మెదక్ జిలాల్లో (పాత జిల్లాలు) గత ఏడాది సెప్టెంబర్ 1 న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు పూర్తికాగానే ఫోటోలు తీసి జాతీయ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఉపాధి హామీ పథకం కింద నీటి సంరక్షణ నిర్మాణాలు, ప్లాంటేషన్లు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు తదితర వౌలిక సదుపాయాలు, వరద నివారణ పనులు, వ్యక్తిగత నిర్మాణాలు, సామూహిక వౌలికవసతుల నిర్మాణం తదితర పనులు కొనసాగుతున్నాయి. వీటిని పారదర్శకంగా ఉంచేందుకు నిర్మాణ పనుల ఫోటోలు తీసి, అవి ఏప్రాంతంలో ఉన్నాయో, ఎప్పుడు చేపట్టి, ఎప్పుడు పూర్తిచేశారో, ఎంత వ్యయం చేశారో తదితర వివరాలన్నింటినీ క్షేత్రస్థాయి సిబ్బంది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ‘జియోఎంజినరేగ వర్కింగ్ గ్రూప్’గా దీనికి పేరుపెట్టారు. ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి, మెదక్ (పాతజిల్లాలు) మినహా (ఇప్పటికే చేపట్టినందువల్ల) మిగతా జిల్లాలకు వర్తింప చేయాలని నిర్ణయించారు. ఈ పనుల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి కమిటీని వేశారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో మొత్తం 36 మంది సభ్యులుగా ఉంటారని మంగళవారం జారీ అయిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.