తెలంగాణ

దొడ్డిదారిన బాదుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: తెలంగాణలో వృత్తి సాంకేతిక విద్యాసంస్థల్లో గత మూడేళ్లుగా కొనసాగుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదానికి అనేక కాలేజీలకు గుర్తింపు ఇవ్వకుండా చెక్ చెప్పిన ప్రభుత్వం తాజాగా డిగ్రీ కాలేజీల్లో ఫీజులకు దొడ్డిదారిని ఎంచుకుంది. యూనివర్శిటీలు ఐదారు రెట్లు అదర్ ఫీజు పేరుతో విపరీతంగా ఫీజులు పెంచుకునేందుకు మార్గం సుగమం చేసింది. ప్రభుత్వం తమకేమీ సంబంధం లేదని చెబుతూనే పరోక్షంగా యూనివర్శిటీలకు మాత్రం ఫీజులు పెంచుకోమని చెబుతోంది. యూనివర్శిటీలు పెంచిన ఫీజులు ప్రభుత్వానికి ఏ విధంగా చూసినా భారం కాకుండా కూడా జాగ్రత్త పడింది. ఇందుకు మరో ఎత్తుగడ వేసింది. కాలేజీల్లో చేరే విద్యార్థులు సహజంగా ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజు అకౌంట్ల కింద ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ రెండు అకౌంట్ల పేర్లు లేకుండా యూనివర్శిటీలు అదర్ ఫీజు పేరుతో కొత్త అకౌంట్ తెరిచాయి.
దాని కింద ఎంత ఫీజు అయినా చెల్లించమని డిమాండ్ చేసే అధికారం యూనివర్శిటీలు ఉంచుకున్నాయి. ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజులు పెంచితే ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని తప్పించుకునేందుకు ప్రభుత్వం అదర్‌ఫీజు పేరిట ఫీజులను పెంచుకునే అవకాశం యూనివర్శిటీలకు కల్పించింది. దాంతో యూనివర్శిటీలు డిగ్రీ కాలేజీల్లో ప్రస్తుత ఫీజుకు అదనంగా 24వేల రూపాయలు వసూలు చేసుకునే వీలుకలిగింది. ఉస్మానియాలో ఈ ఫీజు 24వేల వరకూ ఉండగా, మిగిలిన వర్శిటీల్లో 7500 రూపాయల వరకూ గరిష్టంగా ఉంది.
ఉస్మానియా యూనివర్శిటీలో ఈ అదర్ ఫీజు పాతిక వేల వరకూ నిర్ణయించింది. అదర్ ఫీజు కింద ఉన్న ఫీజును విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బిసిలు సైతం ఈ అదర్ ఫీజును చెల్లించాలి. దీనికీ రీయింబర్స్‌మెంట్‌కూ సంబంధం లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ ప్రయోగం విజయవంతం అయితే రానున్న రోజుల్లో వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లోనూ అదర్ ఫీజు అకౌంట్‌లకు తెరతీయనున్నట్టు తెలిసింది. చాలా డిగ్రీ కాలేజీల్లో అసలు ఫీజు రెండువేలు మొదలు మూడు వేల వరకూ ఉండగా, అదర్ ఫీజు మాత్రం పాతిక వేల వరకూ గరిష్టంగా వసూలు చేసుకునే వీలుండటంతో విద్యార్థులపై దాదాపు 10రెట్ల మేర భారం పడుతోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.