తెలంగాణ

బాహుబలి 2 పైరసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: బాహుబలి 2 చిత్రం పైరసీ కేసులో ఆరుగురు నిందితులను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ప్రధాన సర్వర్‌ను హ్యాక్ చేసి బాహుబలి 2 చిత్రాన్ని డౌన్‌లోడ్ చేసినట్టు దర్యాప్తులో తేలిందని డిసిపి అవినాష్ మహంతి తెలిపారు. మంగళవారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రధాన నిందితుడు రాహుల్ మెహతా (్ఢల్లీ)తోపాటు బీహార్‌కు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు డిసిపి తెలిపారు. బాహుబలి2 చిత్రం పైరసీ చేసిన తరువాత ప్రధాన నిందితుడు రాహుల్ మెహతా నేరుగా హైదరాబాద్‌లోని సినిమా ప్రొడక్షన్ కార్యాలయానికి వచ్చి రూ. 2కోట్లు ఇవ్వకపోతే సినిమాను ఆన్‌లైన్‌లో పెడతామని నిర్మాతను బెదిరించాడు. దీంతో చిత్ర నిర్మాత సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితులు రాహుల్‌మెహతాతోపాటు జితేందర్ మెహతా, తౌఫిక్, మహ్మద్ అలీ, దివాకర్‌కుమార్, చందన్, మోనులను అరెస్టు చేసినట్టు డిసిపి తెలిపారు. నిందితుల వద్ద నుంచి పైరసీ సీడిలు, ఎలక్ట్రానిక్ వస్తువులు సీజ్ చేశామని, ఈ ముఠా గతంలో బాలీవుడ్ చిత్రాలను పైరసీ చేసినట్టు డిసిపి వివరించారు.