తెలంగాణ

ఆకర్షణీయంగా మానేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: కరీంనగర్‌లో మానేరు డ్యామ్ ఫ్రంట్ భాగాన్ని ఆకర్షనీయంగా, పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని డిజైనింగ్ సంస్థ నిపుణులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కోరారు. సబర్మతీ రివర్ ఫ్రంట్‌ను అత్యద్భుతంగా మలిచారని, అదే తరహాలో మానేరు డ్యామ్‌ను తీర్చిదిద్దారని ముఖ్యమంత్రి ఆదేశించారు. రివర్ ఫ్రంట్లను సుందరంగా తీర్చిదిద్దే టాటా బృందం ప్రతినిధులు షనేష్, సూర్య ప్రకాష్ తమ వద్ద ఉన్న నమూనాలపై ప్రగతి భవన్‌లో మంగళవారం ప్రజెంటేషన్ ఇచ్చారు. సబర్మతీ డ్యామ్‌ను ఏ విధంగా తీర్చిదిద్దారో అక్కడికి వెళ్లి అధ్యయనం చేసి రావాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లోని వివిధ పర్యాటక ప్రాంతాలను హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి పరుచడానికి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. కరీంనగర్ జిల్లా సమగ్రాభివృద్ధిపై ఆ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రగతి భవన్‌లో సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం..మంగళవారం క్యాంపు కార్యాలయంలో మానేర్ డ్యామ్‌పై డిజైనింగ్ నిపుణులతో చర్చిస్తున్న సిఎం కెసిఆర్