తెలంగాణ

రైతు ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: అప్పుల బాధ భరించలేక ఓ రైతు ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన రామాపురం మల్లేష్ (34) అనే రైతు వ్యవసాయం నిమిత్తం రూ. 5లక్షలు అప్పు చేశాడు. వేసిన బోర్లలో నీళ్లు రాక, అప్పు తీర్చలేక బాధ పడుతున్న రైతు ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు. మంగళవారం ఉదయం సీఎం కార్యాలయానికి చేరుకున్నాడు.
సీఎంను కలసి తన గోడును విన్నవించుకోవాలనుకున్నాడు. సీఎంను కలిసే అవకాశం దొరకకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. తన వెంట తెచ్చుకున్న గుర్తుతెలియని పురుగుల మందును తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం పంజగుట్ట పోలీసులకు సమాచారమివ్వగా, పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని అపస్మారక స్థితికి చేరుకున్న రైతు మల్లేష్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న రైతు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు పంజగుట్ట పోలీసులు తెలిపారు.
ఇదిలావుండగా మంగళవారం రాత్రి రైతు మల్లేష్‌ను డిశ్చార్జి చేసి ఆయన సొంతూరికి పంపినట్టు తెలిసింది.

చిత్రాలు..సిఎం క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన రైతు.
*గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గద్వాల జిల్లా గట్టు మండలం రైతు మల్లేష్