తెలంగాణ

మరో కోనసీమగా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామన్నపేట, మే 16: ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాలేళ్వరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసి గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల రైతుల కాళ్లు కడుగుతామని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. నల్లగొండ జిల్లా రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి మండలాలకు ప్రధాన సాగునీటి వనరుఅయిన ధర్మారెడ్డిపల్లి కాలువ ఆధునీకరణ పనులకు మండల కేంద్రంలో మంగళవారం విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకే పరిమితం కాకుండా అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిధులకు వెనుకడుగు వేయకుండా అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. తెలంగాణను మరో కోనసీమగా మార్చడానికి సిఎం కెసిఆర్ రాత్రిపగళ్లు కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తున్నాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసి గంధమళ్ల, బస్వాపురం రిజర్వాయర్ ద్వారా యాదాద్రి జిల్లాకు గోదావరి నీళ్లు తీసుకొస్తామని పేర్కొన్నారు. కాళేశ్వరం పూర్తి అయితే తెలంగాణలో 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. భువనగిరి డివిజన్‌లో ప్రధాన సాగునీటి కాలువలైన బునాదిగాని, ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాలువల ఆధునికీకరణకు రూ.248 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు చేసిన పనులు అస్తవ్యస్తంగా ఉండి రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా ఏళ్ల తరబడి కాలయాపన చేయకుండా ఆరు నుండి తొమ్మిది నెలల్లోపు పూర్తిచేసి సాగునీరు అందించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ ర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాలను ప్రజలు తిరస్కరించారని తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు అర్థంపర్థంలేని సమస్యలను ముందట వేసుకుని ఆందోళనలు చేపట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నూరుశాతం అమలు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకుల పరిస్థితి జనం విడిచిన నేతలు, వనం విడిచిన కోతుల మాదిరిగా మారిందని ఎద్దెవా చేశారు. ప్రతిపక్షాల నేతలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి గ్రామస్థాయి టిఆర్‌ఎస్ కార్యకర్త చాలని అన్నారు. సభకు ముందు టిఆర్‌ఎస్ కార్యకర్తలు భారీస్థాయిలో బైకు ర్యాలీ నిర్వహించి మంత్రులకు ఘనంగా స్వాగతం పలికారు.

చిత్రం..రామన్నపేటలో ధర్మారెడ్డిపల్లి కాలువ ఆధునీకరణ పనులకు
శంకుస్థాపన చేస్తున్న మంత్రులు హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డి