తెలంగాణ

జూన్ 2న కొత్త పార్టీ ఆవిర్భావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: తెలంగాణలో కొత్తపార్టీ ఆవిర్భవించబోతున్నది. వచ్చే నెల 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరగనున్నాయి. అదే రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్న తెలంగాణ ఉద్యమ శక్తులు ఏకం కాబోతున్నాయి. దీనికి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదిక కాబోతున్నది. తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ నడుం బిగించారు. ‘తెలంగాణ ఇంటి పార్టీ’ ఆవిర్భావానికి కసరత్తు మొదలైంది. ఈ మేరకు ప్రజాగాయకుడు గద్దర్ చేతుల మీదుగా మంగళవారం గోడపత్రిక (పోస్టర్)ను విడుదల చేయించారు. వచ్చే నెల 2న పార్టీ ఆవిర్భావ సభకు ముఖ్యఅతిథులుగా ఆర్‌ఎల్‌డి నేత అజిత్ సింగ్, టిజెఎసి చైర్మన్ కోదండరామ్, గద్దర్ ప్రభృతులు హాజరుకానున్నట్లు డాక్టర్ చెరుకు సుధాకర్ మంగళవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిస్వార్థంగా కృషి చేసిన ఉస్మానియా, కాకతీయ వర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులను, విద్యార్థులనూ ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తనకు ఎవరూ ఎదురు చెప్పరాదని, ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయరాదని నిరంకుశంగా వ్యవహారిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇందిరా పార్కు వద్ద అనేక సంవత్సరాలుగా ఉన్న ధర్నా చౌక్‌ను ఎత్తి వేయడం, మిర్చి రైతులకు కనీస మద్ధతు ధర లభించకపోవడం, రైతులకు బేడీలు వేయించడం వంటి ఘటనలే ఇందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం ఉందని ఆయన అన్నారు. అందుకే ఆ దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలకు తెలంగాణ ఉద్యమ పార్టీలన్నీ కలిసి రావాలన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ గడువు ఉంది కాబట్టి ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు.
31 జిల్లాల్లో పర్యటిస్తా..
రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తున్న శక్తులను కూడగట్టేందుకు తాను 31 జిల్లాల్లో పర్యటిస్తానని ఆయన తెలిపారు. ఇప్పటికే అనూహ్య స్పందన లభిస్తున్నదని అన్నారు. అనేక ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలుకుతున్నారని ఆయన చెప్పారు. దీనిని బట్టి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉన్నదో స్పష్టంగా తెలుస్తున్నదని అన్నారు. పార్టీ ఆవిర్భావ సభకు నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను ఇవ్వాల్సిందిగా కోరుతూ నగరంలోని సెంట్రల్ జోన్ డిసిపికి దరఖాస్తు చేసి 15 రోజులు దాటిందని ఆయన తెలిపారు.
అయినా డిసిపి అనుమతి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని, నగర పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళానన్నారు. ఒకవేళ ప్రభుత్వం అనుమతించకపోతే నిజాం కళాశాల మైదానంలోనైనా నిర్వహించుకోవడానికి అనుమతినివ్వాలని ఆయన కోరారు.

చిత్రాలు..చెరుకు సుధాకర్* జెఎసి నేత కోదండరామ్