తెలంగాణ

ప్రతి నగరానికీ ఉడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, పోలీస్ కమిషనరేట్స్ పరిధిలో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ముందుగా కరీంనగర్ సమగ్రాభివృద్ధి కోసం శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరి తీరాన ఉన్న ప్రముఖ దేవాలయాలు అన్నింటికీ కరీంనగర్ గేట్ వేగా ఉండేలా తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రగతి భవన్‌లో బుధవారం కరీంనగర్ అభివృద్ధిపై మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఎంపి బి వినోద్‌కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌తో పాటు కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌తో ముఖ్యమంత్రి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మానేర్ డ్యామ్ సుందరీకరణ కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ.506 కోట్లలో రూ.25 కోట్లను తక్షణం విడుదల చేసినట్టు పేర్కొన్నారు. మానేర్ డ్యామ్ రివర్ ఫ్రంట్ 90 కి.మీ ఉంటుందని దీనిని ఉత్తర తెలంగాణకు మణిమకుటంగా, అత్యంత సుందరంగా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు. నదికి అభిముఖంగా స్వర్గ్ధామంగా ఉండే నివాస గృహాలను నిర్మిస్తామని, అందులో మొదటి గృహాన్ని తాను, రెండో గృహాన్ని మంత్రి ఈటల రాజేందర్ కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు.
తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రాలైన వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం వెళ్లే వారికి కరీంనగర్ పట్టణం గేట్‌వేగా ఉండేలా తయారు చేస్తామన్నారు. ఫర్టిలైజర్ కార్పొరేషన్ పునరుద్ధరణతో పాటు కొత్తగా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో 4300 మెగావాట్ల ఉత్పత్తి చేసే అల్ట్రా మెగా పవర్ ప్లాంట్‌గా రామగుండం ఎన్‌టిపిసి మారబోతుందన్నారు. అటవీ అందాలు, ప్రకృతి సౌందర్యాలు, గోదావరి నదిని చూడాలంటే కరీంనగర్ వెళ్లాలనే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. పది కిలోమీటర్ల పొడవైన మానేరు డ్యామ్‌పై టూరిస్టు స్పాట్, వ్యూ పాయింట్, రెస్టారెంట్, కాటేజీలు, బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.15 కోట్లకు అదనంగా రూ.25 కోట్లను కలిపి మొత్తంగా 40 కోట్ల వ్యయంతో మానేరు డ్యామ్‌ను సుందరీకరిస్తామన్నారు.
ఈ సారి హరితహారాన్ని కరీంనగర్ నుంచి తానే ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. కరీంనగర్ హరితహారం కోసం ప్రభుత్వం కేటాయించిన రూ. 10 కోట్లకు అదనంగా నియోజకవర్గాల అభివృద్ధి నిధుల నుంచి రూ. 50 లక్షల చొప్పున ఇస్తామని ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రకటించారు. హైదరాబాద్ మాదిరిగా కమాండ్, కంట్రోల్ సెంటర్ నిర్మిస్తామని, జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలోనే పోలీస్ కమిషనరేట్‌ను నిర్మించనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత కలెక్టరేట్ ప్రాంగణంలోని పది ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను నిర్మిస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కళాభారతిని నిర్మిస్తామన్నారు.

చిత్రం.... మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్