తెలంగాణ

ఎకరం రూ.42.59 కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: హైదరాబాద్‌లో ఎకరం భూమి రూ.42.59 కోట్ల చొప్పున రికార్డు స్థాయిలో ధర పలికింది. నగర పొలిమేరలో రాయదుర్గంలోగల తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి వౌలిక వసతుల సంస్థకు (టిఎస్‌ఐఐసి) చెందిన ఐదెకరాల స్థలానికి ఈ-వేలం నిర్వహించగా ఎకరాకు రూ.42.59 కోట్లు ధరతో కొనుగోలు జరిగింది. ఐదెకరాలకు మొత్తంగా కలిపి ప్రభుత్వానికి రూ.185 కోట్లు వచ్చినట్టు టిఎస్‌ఐఐసి అధికారులు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వేలం వేసినప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో ధర పలుకలేదని వారు వివరించారు. నగర పొలిమేరలో టిఎస్‌ఐఐడిసికి చెందిన 15 ఎకరాలను వేలం వేయాలని నిర్ణయించగా మొదటిరోజు ఐదు ఎకరాలు అమ్ముడుపోయింది.