తెలంగాణ

సచివాలయానికి పరేడ్‌గ్రౌండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: వాస్తు దోషాలున్న ప్రస్తుత సచివాలయం స్థానంలో మరో చోట కొత్త సచివాలయం నిర్మించాలన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కోరిక నెరవేరబోతుంది. కొత్త సచివాలయం నిర్మాణానికి సికింద్రాబాద్‌లోని రక్షణశాఖకు చెందిన పరేడ్‌గ్రౌండ్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్టు తాజా సమాచారం. గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ గురువారం ఢిల్లీలో ప్రధానమంత్రితో పాటు కేంద్రమంత్రులతో భేటీ సందర్భంగా సచివాలయ నిర్మాణానికి పరేడ్ గ్రౌండ్‌ను కేటాయించడానికి రక్షణశాఖ అంగీకరించిందని సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అయితే పరేడ్‌గ్రౌండ్‌లోని 100ఎకరాలకు ప్రత్యామ్నాయంగా మరోచోట స్థలం ఇవ్వనున్నట్టు సిఎం చేసిన ప్రతిపాదనకు రక్షణశాఖ సమ్మతించినట్టు ఈ వర్గాల సమాచారం. ప్రత్యామ్నాయంగా ఇవ్వబోయే స్థలాలపై త్వరగా ప్రతిపాదనలు పంపిస్తే అధికారికంగా తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని రక్షణశాఖ రాష్ట్రప్రభుత్వానికి వారంరోజుల్లో లేఖ రాయబోతుందని తెలిసింది. పరేడ్‌గ్రౌండ్ స్థలం అత్యంత ఖరీదయింది కావడంతో అంతే విలువకు సరిపడినంత భూమిని కేటాయించాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా రక్షణ శాఖ సూచించగా ఆయన కూడా అందుకు అంగీకారం చెప్పినట్టు తెలిసింది. ఇలా ఉండగా కేంద్రం, రక్షణశాఖ వర్గాల నుంచి పరేడ్ గ్రౌండ్ కేటాయించడానికి సుముఖంగా ఉన్నట్టు ప్రభుత్వానికి సమాచారం అందడంతో దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సిఎం ఆదేశించినట్టు తెలిసింది. పరేడ్‌గ్రౌండ్‌కి ప్రత్యామ్నాయంగా వికారాబాద్, మెదక్, వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో కనీసం వెయ్యి నుంచి 15వందల ఎకరాలు ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై పరిశీలించి నివేదిక ఇవ్వాలని తమకు రక్షణశాఖ నుంచి ఆదేశాలు అందినట్టు స్థానిక కంటోనె్మంట్ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. వనపర్తి, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రతిపాదించిన స్థలాల కంటే వికారాబాద్ వద్ద ప్రతిపాదించిన స్థలం పట్ల స్థానిక రక్షణశాఖ అధికారులు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. వికారాబాద్ వద్ద ప్రతిపాదిత స్థలానికి సంబంధించి సమగ్ర నివేదికను త్వరగా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా అధికారులను ఆదేశించినట్టు ఈ వర్గాల సమాచారం.

చిత్రం... కొత్త సచివాలయ నమూనా చిత్రం