తెలంగాణ

అమితా’నందంతో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాజపా ముందస్తు ఎన్నికల ప్రచారం
తెలంగాణ గద్దెపైనే నాయకత్వం దృష్టి
పార్టీ చీఫ్ పర్యటనకు భారీ ఏర్పాట్లు
మావోయిస్టు ముప్పుపై గట్టి నిఘా
మూడు రోజులపాటు విస్తృత పర్యటన
నక్సల్స్ బాధిత కుటుంబాల పరామర్శ
22న రాక, 25న నేరుగా విజయవాడకు

హైదరాబాద్, మే 19: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఊపుమీదున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ గద్దె నెక్కేందుకు వ్యూహాత్మక సన్నాహాల్లో నిమగ్నమైంది. ఇంతవరకూ చాప కింద నీరులా ప్రచారం చేసిన బిజెపి నేతలు, రెండేళ్లుముందే ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. ఇప్పటికే ముగ్గురు కేంద్ర మంత్రులు మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటన జరిపారు. తాజాగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మూడు రోజులపాటు నల్గొండ జిల్లాలోనూ, యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ, హైదరాబాద్‌లోనూ విస్తృత పర్యటన చేపట్టనున్నారు. 22 నుంచి పర్యటన 25 వరకూ సాగనుంది. 25న ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తారు. 22న ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చౌటుప్పల్, నారాయణపూర్, గట్టుప్పల్ మీదుగా నల్గొండ జిల్లా చందూరు మండలం తెరత్‌పల్లికి వెళ్తారు. 1999 మార్చి 27న నక్సల్స్ చేతిలో హతమైన అప్పటి బిజెపి సెక్రటరీ గండగోని మైసయ్య గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి, ఆయన విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అక్కడే ఇంటింటికి వెళ్లి నరేంద్రమోదీ పాలన, పథకాలు, అమలు తీరుపై స్థానిక ప్రజలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం పార్టీ బూత్‌స్థాయి సభ్యులతో సమావేశమై 1.30కి దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. 3.30కి మునుగోడు మీదుగా నల్గొండ చేరుకుని క్లాక్ టవర్ సమీపంలోని స్టే ఇన్ హోటల్‌లో 4 గంటలకు 400మంది ఎంపిక చేసిన మేథావులతో సంభాషిస్తారు. 5.30కి రాష్టస్థ్రాయి పదాదికారులు, జిల్లా అధ్యయులు వందమందితో సమావేశమవుతారు. రాత్రికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో భేటీ అవుతారు. అనంతరం నల్గొండలోనే భోజనం చేసి బిజెపి కార్యాలయం లేదా ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేస్తారు. మరుసటి రోజు 23న వెలుగుపల్లి గ్రామానికి చేరుకుని అక్కడ పండిట్ దీన్‌దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. దళితవాడకు దీన్ దయాళ్ వాడగా నామకరణం చేస్తారు. అక్కడి నుండి 10.20కి చిన్నమాదారం గ్రామానికి వెళ్లి గ్రామంలో నరేంద్రమోదీ పథకాల అమలుతీరును పరిశీలిస్తారు. బిజెపికి చెందిన మహిళా సర్పంచ్ వందశాతం ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణం, జన్‌ధన్ పథకం, జనసురక్ష బీమా, జీవనజ్యోతి కార్యక్రమాల అమలుతీరు పరిశీలిస్తారు. 10.50కి పెద్ద దేవులపల్లి గ్రామానికి వెళ్లి అక్కడ బూత్ కమిటీ సభ్యులతో సమావేశమవుతారు. అక్కడే గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. మధ్యాహ్నం నల్గొండ చేరుకుని పాత్రికేయులతో మాట్లాడిన అనంతరం 5.30కి తెలంగాణ ఓబిసి సంఘం నేతలతో లక్ష్మీగార్డెన్స్‌లో భేటీ అవుతారు. రాత్రి 8 గంటలకు పార్టీ నేతలతో సమావేశమవుతారు. 24న ఉదయం 9 గంటలకు నల్గొండలో బయలుదేరి చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామానికి వెళ్తారు. నిజాం పాలనలో రజాకర్ల దాష్టీకానికి బలైన కుటుంబీకులను కలుసుకుంటారు. ఒకే ఘటనలో వందలాది యువకులను రజాకర్లు ఉరితీసిన గ్రామం కావడంతో అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు భువనగిరి అతిథి గృహానికి చేరుకుని తెలంగాణ మేథావులతో సమావేశం అవుతారు. అనంతరం అమిత్‌షా మెహిదీపట్నంలోని క్రిస్టల్ గార్డెన్స్‌కు చేరుకుని అక్కడే రాత్రి భోజనం చేసి బూత్‌స్థాయి కమిటీ సభ్యులు 3వేల మందితో సమావేశమవుతారు. సమావేశ అనంతరం హరితప్లాజాకు చేరుకుని అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. 25 ఉదయం 8 గంటలకు విమానంలో విజయవాడ బయలుదేరుతారు.
ఎన్నికల సమయంలోనూ తొలి ఎన్నికల ప్రచారం హైదరాబాద్ నుండే మొదలైంది. ఆ సెంటిమెంట్ బిజెపికి బాగా కలిసి రావడంతో ఈసారీ హైదరాబాద్ కేంద్రంగా బిజెపి ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే షా కార్యక్రమాలు రూపొందించారు. కాగా అమిత్‌షా పర్యటన ఎక్కువ భాగం రోడ్డుమార్గంలో ఉండటంతో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు.