తెలంగాణ

రాజధాని నడిబొడ్డునే ధర్నాచౌక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 19: ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి, పాలకులకు విన్నవించుకోవడానికి ధర్నాచౌక్ రాజదాని నడిబొడ్డున ఉండాల్సిందేనని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ను రక్షించుకోవడానికి ఎంతవరకైనా ముందుకు వెళ్తామని టిజెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌కు విచ్చేసిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు తమ సమస్యలు పరిష్కరించమంటే వ్యక్తిగత దాడులకు ప్రభుత్వం దిగడం తగదని ఆరోపించారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్ విషయంలో తాము ప్రభుత్వానికి జెఎసి తరపున మంచి సూచన ఇచ్చామని అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం చుపాలని కోరితే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల తరపున మాట్లాడేవారి గొంతును నొక్కడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అందుకే ధర్నాచౌక్‌ను పరిరక్షించుకోవడానికి వేరొకమార్గం లేక ఉద్యమానికి దిగామని తెలిపారు. సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం పోలీసులను మఫ్టీలో పంపించి ప్రజల మధ్య కొట్లాట పెట్టడానికి కుట్రలు పన్నిందని దుయ్యబట్టారు. ఇది దిగజారుడుతనానికి నిదర్శనమని ముఖ్యంగా ప్రభుత్వం గుర్తించుకోవాల్సింది. ప్రజల గొంతును వినిపించేందుకు ప్రభుత్వమే వేదికను ఏర్పాటు చేయాల్సిందిపోయి ప్రజల గొంతును నొక్కడానికి చూస్తుందన్నారు. అంతా ఏకపక్షం అనుకోవడం మూర్ఖత్వం అవుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టుదలకు పొకుండా ప్రజాస్వామ్యబద్దంగా ఆలోచించాలని హితవు పలికారు. ఏకపక్షం అనుకోవడం సరికాదని ఎవరూ కూడా అలాంటివారు అధికార పీఠంపై శాశ్వతంగా కూర్చోలేకపోయారని ఈ ప్రభుత్వానికి కూడా అలాంటి పరిణామాలే మునుముందు చూడబోతుందని హెచ్చరించారు. పాలకులు వ్యక్తిగత దాడులకు దిగడం అనైతికతకు నిదర్శనమని ప్రజాసమస్యలను తెలియజేసేందుకు ధర్నాచౌక్‌ను కాపాడుకుంటామని త్వరలోనే ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ భేటీ కానుందని కోదండరాం వెల్లడించారు.

మహబూబ్‌నగర్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న టిజెఎసి చైర్మన్ కోదండరాం