తెలంగాణ

కాలానుగుణంగా పార్టీలూ మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయ పార్టీలు మారాలని, ప్రజల అవసరాల మేరకే పనిచేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. పార్టీలను ప్రజలు ఆదరించడం లేదంటే ఆ లోపం పార్టీలదేనని, నాయకుల్లోనో, సిద్ధాంతాల్లోనో ఏదో లోపం ఉందని అర్థమని అన్నారు. ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వియత్నాం జాతిపిత హోచిమన్ 128వ జయంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వియత్నాంలో మంచి అభివృద్ధి జరుగుతోందని అక్కడ ఏకపార్టీ కమ్యూనిస్టు వ్యవస్థ ఉందని ఈ దేశాన్ని మన ముఖ్యమంత్రి కెసిఆర్ చూసి వస్తే మంచిదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్న మాటలకు ఉప ముఖ్యమంత్రి వేదిక మీదనే బదులిచ్చారు. వియత్నాం గెరిల్లా పోరాటాల ద్వారా హోచిమన్ నాయకత్వంలోని స్వాతంత్య్రాన్ని సాధించిందని, భారతదేశంలో అహింసా విధానంలో గాంధీజీ నేతృత్వంలో స్వాతంత్య్రం సాధించిందని అన్నారు. అదే అహింసా విధానంలో తెలంగాణ ప్రజల సమిష్టి పోరాటాలతో కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ స్వాతంత్య్రం సాధించిందని పేర్కొన్నారు. వియత్నాం స్వాతంత్య్రం సాధించి 72 సంవత్సరాలు అవుతుంటే తెలంగాణ స్వాతంత్య్రం సాధించి మూడేళ్లు మాత్రమే అయిందని అపుడే అభివృద్ధిని పోల్చి చూడనక్కర్లేదని అన్నారు. అయితే మంచి విధానాలు ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్లి చూసి రావల్సిందేనని చెప్పారు. నార్వే, డెన్మార్క్, స్వీడన్‌లు కూడా మంచి అభివృద్ధి సాధిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే కమ్యూనిజం ఆలోచనలు, ప్రతి ఒక్కరిలో ఉండాలని, కానీ కమ్యూనిస్టు పార్టీల్లోనే ఉండాలనేది కరక్టు కాదని అన్నారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకత్వం కావాలని చెప్పారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్సీ యాదవరెడ్డి అధ్యక్షత వహించగా, వియత్నాం రాయబారి తన్‌సిన్ తాన్, సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు.